జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ప్రతిపక్ష హోదా కూడా రాదు!

ఈసారి ఎన్నికల్లో వైసీపీకి దారుణమైన దెబ్బ తగిలింది. ఎప్పటికీ కోలుకోలేని విధంగా కూటమి వైసీపీ ఓడించింది. కనీసం డిపాజిట్ అయినా దక్కించుకుంటుందా..ప్రతిపక్ష హోదా అయినా దక్కుతుందా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

New Update
జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ప్రతిపక్ష హోదా కూడా రాదు!

ఆంధ్రాలో వైసీపీ ఘోర పరాభవం దిశగా వెళుతోంది. జగన్ ప్రభుత్వానికి ప్రజలు టాటా బైబై చెప్పేశారు. అది కూడా మామూలుగా కాదు...చాచి పెట్టి కొట్టినట్టు చెప్పారు. వైసీపీ పాలనకు చరమగీతం పాడారు. కూటమిని ఘన విజయం సాధించేలా చేశారు. కౌంటింగ్ మొదలయి చాలాసేపే అవుతోంది. మొదటి నుంచి వైసీపీ ఏ దశలోనే కూటమికి పోటీ ఇవ్వలేకపోయింది. మొత్తం వార్ వన్‌సైడ్ అయిపోయింది. టీడీపీ గెలుస్తుందని ముందు నుంచీ అంచనాలు ఉన్నాయి కానీ మరీ ఇంతలా ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు.

రాష్ట్రంలో దాదాపు 90 శాతం స్థానాల్లో కూటమి నెగ్గుకొస్తోంది. అన్ని రౌండ్లలోనూ వైసీపీ ఏ మాత్రం సత్తా చూపలేకపోయింది. కౌంటింగ్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ప్రజాతీర్పు మాత్రం స్పష్టం అయిపోయింది. అందుకే సీఎం జగన్ కూడా రాజీనామా చేసేశారు. మరోవైపు కూటమి నేతలు విజయసంబరాలను అనౌన్స్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు. చంద్రబాబు ఇంటి దగ్గర భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే వైసీపీ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అసలు ప్రతి పక్ష హోదా అయినా దక్కుతుందా అనేది అనుమానం మారింది. ఆంధ్రాలో ప్రతిపక్ష హోదాలో నిలవాలంటే కనీసం 18 సీట్లు రావాలి కానీ...ఇప్పటి పరిస్థితిని బట్టి అది కూడా వచ్చేలా కనిపించడం లేదు. ఇప్పటివరకు వెలువడిని ఫలితాల్లో 18 కంటే తక్కువ స్థానాల్లోనే వైసీపీ ఆధిక్యంలో ఉంది. దీనికన్నా జనసేన లీడింగ్‌లో ఉంది. 20 లీడ్‌లో ఉన్న జనసేన నెమ్మదిగా గఎలుపును ఖాయం చేసుకుంటూ దూసుకుపోతోంది.

Also Read:పవన్ కల్యాణ్ అభిమానులకు షాక్.. ఇక సినిమాలకు దూరం!

Advertisment
తాజా కథనాలు