RBI: పాత రూ.1000 నోట్లు మళ్లీ చలమణిలోకి రానున్నాయా ?

కేంద్రం పెద్ద నోట్లను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో.. మళ్లీ పాత పెద్ద నోట్లు చలామణిలోకి వస్తాయానే వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే దీనిపై కేంద్ర బ్యాంకైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. మళ్లీ వెయ్యి రూపాయల నోట్లను ప్రవేశపెట్టే అవకాశాలు లేవని.. సోర్సెస్‌ను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ రిపోర్టు చేసింది. మరోవైపు ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనలు తమ వద్ద ఏమి లేవని గతంలోనే ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ క్లారిటీ ఇచ్చారు.

New Update
RBI: పాత రూ.1000 నోట్లు మళ్లీ చలమణిలోకి రానున్నాయా ?

ఇటీవల కేంద్ర ప్రభుత్వ 2 వేల రూపాయల కరెన్సీ నోట్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో తెగ వైరలైపోతోంది. కేంద్రం పెద్ద నోట్లను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో.. మళ్లీ పాత పెద్ద నోట్లు చలామణిలోకి వస్తాయానే ఊహగాణాలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం పెద్ద నోట్లు లేని కారణంగా గతంలో రద్దు చేసినటువంటి వెయ్యి రూపాయల నోట్లను తిరిగి చలామణిలోకి తీసుకురావాలనే వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే దీనిపై కేంద్ర బ్యాంకైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. మళ్లీ వెయ్యి రూపాయల నోట్లను ప్రవేశపెట్టే అవకాశాలు లేవని.. సోర్సెస్‌ను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ రిపోర్టు చేసింది. ఇదిలా ఉండగా.. మరోవైపు చూసుకుంటే ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనలు తమ వద్ద ఏమి లేవని గతంలోనే ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ క్లారిటీ ఇచ్చారు.


ఇదిలా ఉండగా.. 2016లో నవంబర్‌లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర సంచలన ప్రకటన చేసిన సంగతి అందరికి తెలిసిందే. అలాగే ప్రజలు తమవద్ద ఉన్న నోట్ల మార్పిడికి కూడా కొంత సమయాన్ని ఇచ్చింది బీజేపీ సర్కార్. అయితే అప్పట్లో ఈ ఊహించని ప్రకటన వల్ల దేశవ్యాప్తంగా పెను దుమారం రేగింది. చాలామంది దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆ తర్వాత పాత నోట్ల స్థానంలో కొత్త 500 నోట్లతో సహా.. కొత్త 2 వేల రూపాయల కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టారు. అయితే క్లీన్ నోట్ పాలసీలో భాగంగా ఇటివలే రూ.2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంది ఆర్‌బీఐ. అలాగే రూ.2 వేల నోట్ల మార్పిడికి కూడా కొంత సమయాన్ని ఇచ్చింది. దీంతో ముందుగా సెప్టెంబర్ 30 వరకు గడువు నిర్ణయించింది. ఆ తర్వాత అక్టోబర్ 7 వరకు వరకు అవకాశాన్ని పొడగించింది. అలాగే అక్టోబర్ 7 తర్వాత కూడా ఇంకా ఎవరి వద్దనైన 2 వేల రూపాయల నోట్లు ఉంటే ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో వాటిని మార్పులు చేసుకోవచ్చని చెప్పింది.

Advertisment
తాజా కథనాలు