RBI: పాత రూ.1000 నోట్లు మళ్లీ చలమణిలోకి రానున్నాయా ?
కేంద్రం పెద్ద నోట్లను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో.. మళ్లీ పాత పెద్ద నోట్లు చలామణిలోకి వస్తాయానే వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. అయితే దీనిపై కేంద్ర బ్యాంకైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. మళ్లీ వెయ్యి రూపాయల నోట్లను ప్రవేశపెట్టే అవకాశాలు లేవని.. సోర్సెస్‌ను ఉటంకిస్తూ ఏఎన్ఐ రిపోర్టు చేసింది. మరోవైపు ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనలు తమ వద్ద ఏమి లేవని గతంలోనే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ క్లారిటీ ఇచ్చారు.