హార్దిక్ పాండ్యా తిలక్‌ వర్మను అందుకే అడ్డుకున్నాడా..?

తత్కాలిక కెప్టెన్‌, ఆల్‌ రౌండర్‌ హార్డిక్ పాండ్యాపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త బ్యాటర్‌ తిలక్ వర్మ హాఫ్‌ సెంచరీ చేసే అవకాశం ఉన్నా హార్దిక్ పాండ్యా అతనికి అవకాశం ఇవ్వకపోవడంపై మాజీలు, నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

హార్దిక్ పాండ్యా తిలక్‌ వర్మను అందుకే అడ్డుకున్నాడా..?
New Update

తెలుగు క్రికెటర్ తిలక్‌ వర్మపై కెప్టెన్‌ హార్డిక్ పాండ్యా కక్ష్య సాధించాడా..? తిలక్‌ వర్మను హాఫ్‌ సెంచరీ చేయకుండా హార్డిక్‌ పాండ్యా కావాలనే అడ్డుకున్నాడా..?  ఓవర్లు సరిపడ లేకపోవడంతోనే తిలక్‌ వర్మకు అవకాశం రాలేదా..? హార్దిక్‌ పాండ్యా తొటి క్రికేటర్లను తొక్కేయాలని చూస్తున్నాడా..? అసలు సమస్య ఎక్కడ వచ్చింది..? సిక్స్‌ కొట్టి మ్యాచ్‌ను గెలిపించానని పాండ్యా ఆనందంలో ఉన్నాడా..

విండీస్‌తో జరుగుతోన్న టీ20 సీరిస్‌లో భారత జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది.  మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన టీమిండియా తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బ్యాటర్లు సూర్యకుమార్‌ యాదవ్, తిలక్ వర్మ రాణించడంతో మరో 12 బంతులు మిగిలి ఉండగానే భారత్‌ విజయకేతనం ఎగురవేసింది. కానీ ఈ మ్యాచ్‌లో యంగ్‌ ప్లేయర్ తిలక్‌ వర్మ హాఫ్‌ సెంచరీ మిస్సైంది. భారత్ విజయం సాధించాలంటే 12 బంతుల్లో 2 పరుగులు చేయాలి. ఆ సమయంలో కెప్టెన్‌ హార్దిక్ పాండ్యా స్ట్రైక్‌లో ఉండగా.. తిలక్ వర్మ 49 పరుగులతో నాన్‌ స్ట్రైక్‌లో ఉన్నాడు. తిలక్‌ వర్మకు హాఫ్‌ సెంచరీ చేసే అవకాశం ఉన్నా హార్డిక్‌ పాండ్యా అతనికి అవకాశం ఇవ్వలేదు. తిలక్‌కు స్ట్రైక్ ఇవ్వకుండా సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. 

కెప్టెన్‌ హార్డిక్‌ పాండ్యా చేసిన పనికి నెటిజన్లు, మాజీల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా తిలక్‌ వర్మకు స్ట్రైక్‌ ఇస్తే యంగ్‌ బ్యాటర్‌ మరో హాఫ్‌ సెంచరీ చేసేవాడని, దీంతో అతనికి రెట్టింపు ఉత్సాహం వచ్చేదని. మరో మ్యాచ్‌లో అదే ఉత్సాహంతో ఆడేవాడని మాజీ ఆటగాళ్లు అంటున్నారు. మరోవైపు హార్దిక్‌ పాండ్యా స్వార్ధపరుడని, తన కళ్లముందు కొత్త ప్లేయర్లు ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నాడని నెటిజన్లు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అంతే కాకుండా హార్దిక్‌ పాండ్యా సీనియర్లను సైతం గౌరవించడని ఆరోపిస్తున్నారు. గతంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాటలను పట్టించుకోలేవదని, అతను అడిగితే నువ్వేంటి నాకు చెప్పేది అనే విధంగా మాట్లాడాడని గుర్తు చేశారు. తిలక్‌ వర్మ రానున్న రోజుల్లో తన స్థానానికి ఎసరుపెడుతాడనే దురుద్దేశంతోనే అతను హాఫ్‌ సెంచరీ చేయకుండా అడ్డుకున్నాడని మండిపడతున్నారు. 

కాగా మంగళవారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న విండీస్‌ నిర్ణిత ఓవర్లు ముగిసే సరికి 5 వికెట్ల న‌ష్టానికి  159 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య  ఛేదనకు దిగిన టీమ్‌ ఇండియా ఓపెనర్లు తక్కువ పరుగుల వద్దే ఔట్‌ కాగా సూర్య‌కుమార్ యాద‌వ్ (83), తిలక్‌ వర్మ(49) పరుగులతో రాణించడంతో భారత్‌  మూడు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 

#west-indies #india #hardik-pandya #3rd-t20 #tilak-verma
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe