/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/gill-jpg.webp)
భారత యువ సంచలనం శుభ్ మన్ గిల్...ఓపెనర్ గా దిగి దూకుడుగా పరుగులు చేయడంలో దిట్ట. ప్రతీ మ్యాచ్ కు తనను తాను మెరుగుపర్చుకుంటూ వెళుతున్న గిల్ ఇప్పుడు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను కొల్లగొట్టడానికి అడుగు దూరంలో ఉన్నాడు. సెహ్వాగ్, విరాట్, రోహిత్ ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డును శుభ్‌మన్ గిల్ సాధించబోతున్నాడు.
ఆసీస్‌తో మ్యాచ్‌లో గిల్ మరో 31 పరుగులు సాధిస్తే ఒక క్యాలెండర్ ఇయర్‌లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. 1996లో క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన ఈ రికార్డ్ ఇప్పటి వరకూ ఎవరూ చేధించలేకపోయారు.
కాగా 2023 క్యాలెండర్ ఇయర్‌లో గిల్ ఇప్పటివరకు 1580 పరుగులు చేశాడు. అంతకుమముందు 1996 ఏడాదిలో సచిన్ 1611 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌తో సచిన్ వరల్డ్ రికార్డును గిల్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన గిల్.. 350 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మతో కలిసి జట్టుకు అద్భుతమైన ఆరంభాలను అందిస్తున్నాడు.
ఒక క్యాలెండర్ ఇయర్ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ళు...
సచిన్ టెండూల్కర్ (1996)- 1,611 పరుగులు
శుబ్‌మన్ గిల్ (2023)-1,580 పరుగులు
విరాట్ కోహ్లీ (2011)-1381 పరుగులు
మహేల జయవర్ధనే (2001)-1,260 పరుగులు
కేన్ విలియమ్సన్ (2015)- 1,224 పరుగులు