Movies:చిరు విశ్వంభరలో రానా విలన్?

మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్ సినిమా పట్టలెక్కేసింది. బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాకు విశ్వంభర అనే పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో రానా దగ్గుబాటి విలన్ గా నటిస్తారని టాక్ నడుస్తోంది.

Movies:చిరు విశ్వంభరలో రానా విలన్?
New Update

రీమేక్ లతో దెబ్బతిన్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు కొత్త సినిమా మీద ఫోకస్ పెట్టారు. వాల్తేరు వీరయ్యతరు వాత వచ్చిన భోళాశంకర్ అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో ఇక మీదట రీమేక్ లు చేయకూడదని అనుకున్నారు. ఇప్పుడు బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది ఒక సోషియో పాంటసీ సినిమా. బింబిసారలానే టైమ్ ట్రావెల్, ఫాంటసీలు కలిసి ఉంటాయి. దీనికి విశ్వంభర అనే టైటిల్ ఖరారు చేశారని కూడా తెలుస్తోంది.

Also Read:యోధుడిగా భక్త కన్నప్ప..ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్.

మెగా 156 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ మూవీ షూటింగ్ మొదలయ్యింది. ప్రధాన తారాగణం మీద సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్డేట్ ఏంటంటే ఇందులో రానా దగ్గుబాటి విలన్ గా నటిస్తున్నారని. దర్శకుడు వశిష్ట రానాకు కథ వినిపించారని, ఆయనకు నచ్చడంతో ఓకే కూడా చెప్పేశారని అంటున్నారు.

మెగా 156 సినిమాకు అస్కార్ అవార్డు గ్రహీతలు పని చేస్తున్నారు. సంగీత దర్శకుడిగా ఎమ్ఎమ్ కీరవాణి, గీత రచయితగా చంద్రబోస్ పని చేస్తున్నారు. దర్శకుడు వశిష్ట, చంద్రబోస్, కీరవాణి, చిరంజీవిల మధ్య పాటల గురించి చర్చలు జరిగాయని...మ్యూజిక్ సిట్టింగ్స్ అవుతున్నాయని మూవీ యూనిట్ చెబుతున్నారు.

మెగా 156 ప్రొడక్షన్ డిజైన్ : ఏఎస్ ప్రకాష్, కాస్ట్యూమ్ డిజైనర్ : సుశ్మితా కొణిదెల, కూర్పు : కోటగిరి వెంకటేశ్వర రావు & సంతోష్ కామిరెడ్డి, మాటలు : సాయి మాధవ్ బుర్రా, పాటలు : శ్రీ శివ శక్తి దత్తా & చంద్రబోస్, స్క్రిప్ట్ అసోసియేట్స్ : శ్రీనివాస గవిరెడ్డి - గంటా శ్రీధర్ - నిమ్మగడ్డ శ్రీకాంత్ - మయూఖ్ ఆదిత్య, ఛాయాగ్రహణం : ఛోటా కె. నాయుడు

Also Read:నేడు అక్కినేని వారసుడు నాగ చైతన్య బర్త్ డే.. 14 ఏళ్ల కెరియర్ లో ప్రతీ సినిమా స్పెషలే!

#megastar #chiranjeevi #rana-daggibati #new-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe