Amethi : రాయబరేలీలోనే రాహుల్.. వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఘన విజయం సాధించారు. అయితే రెండింటిలో రాహుల్ కొనసాగే అవకాశం లేదు కాబట్టి వయనాడ్ స్థానంలో ప్రియాంక గాంధీని పోటీ చేయిస్తారని టాక్ నడుస్తోంది. By Manogna alamuru 05 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Wayanad : రాహుల్ గాంధీ (Rahul Gandhi) స్థానం అయిన వయనాడ్ నుంచి ఆయన చెల్లెలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పోటీ చేస్తారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అసలు మొదటి నుంచి ఈ సారి ఎన్నికల్లో ప్రియంకా గాందీ పోటీ చేస్తారని చెబుతూనే ఉన్నారు. తెలంగాణ (Telangana) లో ఒక స్థానం నుంచి అనుకున్నారు. అది అవ్వలేదు. తరువాత అమేధీ, రాయబరేలీల్లో ఏదో ఒకచోట నుంచి ఆమె పోటీ చేస్తారని చెప్పారు. నామినేషన్ నివరి రోజు వరకు ఈ చర్చ నడిచింది. కానీ చివరి నిమిషంలో రాయబరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కేఎల్ శర్మలు పోటీ చేశారు. అమేథీ, రాయబరేలీలు కాంగ్రెస్ (Congress) కు కంచుకోటలు. ఎప్పుడూ ఇక్కడ నుంచి ఓడిపోలేదు. కానీ 2019 ఎన్నికల్లో అమేథీ నుంచి రాహుల్ గాంధీ స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఈ సారి ఆ స్థానంలో ఆయన పోటీ చేస్తారా లేదా అనే సందేహం నెలకొంది. దాంతో పాటూ గత ఎన్నికల వరకు రాబరేలీ నుంచి సోనీయాగాంధీ పోటీ చేశారు. ఈ సారి ఆమె రాజ్యసభకు వెళ్ళిపోవడంతో అక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ నడిచింది. రెండు స్థానాల కోసం ప్రియాంక గాంధీ పరిశీలనకు వచ్చింది. చివర వరకు నిర్ణయించుకోలేకపోయారు. చివరకు ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. దీనికిగల కారణాలు ఏమీ బయటకు రాలేదు. అంత ప్రత్యేక కారణాలు ఉన్నట్టు కూడా కనిపించలేదు. దీంతో ఈసారి రాహుల్ అమేధీ నుంచి కాకుండా తన తల్లి స్థానం అయిన రాయబరేలీ నుంచి పోటీ చేశారు. అమేథీలో కే ఎల్ శర్మ నించున్నారు. అయినా కూడా ఈసారి కాంగ్రెస్ తన కంచుకోటలను కాపాడుకుంది. రెండింటిలోనూ ఘన విజయం సాధించింది. ఇప్పుడు రాహుల్ గాంధీ తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ గెలిచారు. దీంతో యన ఇందులో ఒకదానికి రాజీనామా చేయనున్నారు. ఇందులో రాయబరేలీని ఆయన ఉంచుకుని వయనాడ్‌ను వదిలేస్తారని చెబుతున్నారు. అప్పుడు ఆ స్థానం ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి పోటీ చేయడానికి కరెక్ట్ అభ్యర్ధి ప్రియాంక ఒక్కరే అవైలబుల్గా ఉన్నారు. అది కూడా రాహుల్ గాంధీ విన్నింగ్ స్థానం కాబట్టి ఆయన చెల్లెలుగా ప్రియాంక కూడా వయనాడ్ నుంచి గెలిచే అవకాశం ఉంది. అందుకే ఇక్కడ నుంచి ఆమెనే నిలబెడతారని అంటున్నారు. Also Read : తెలంగాణలో ప్రభావం చూపని కాంగ్రెస్.. కలిసిరాని అంశాలివే! #elections #priyanka-gandhi #wayanad #congress #rahul-gandhi సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి