Breaking : ఎన్టీయార్‌కు భారత రత్న?

ఎన్టీయార్‌కు భారతరత్న ఇవ్వనున్నారా అంటే అవుననే అంటున్నారు. దీని విషయమై కేంద్ర కేబినెట్ మరి కాసేపట్లో సమావేశం కానుంది. ఇప్పటికే చాలాసార్లు ఎన్టీయార్‌కు భారత రత్న ఇవ్వాలని ప్రతిపాదనలు వెళ్ళాయి. ఈరోజు మీటింగ్‌లో ఈ విషయం గురించి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 

New Update
Breaking : ఎన్టీయార్‌కు భారత రత్న?

Bharata Ratna To NTR : ఎన్టీయార్‌(NTR) కు భారతరత్న(Bharata Ratna) అనే అంశం మళ్ళీ తెరమీదకు వచ్చింది. ఈ రోజు కేంద్ర కేబినెట్ ఈ విషయమై సమావేశం అవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే చాలాసార్లు ఎన్టీయార్‌కు భారత రత్న ఇవ్వాలని ప్రతిపాదనలు, వినతులు వెళ్ళడంతో వాటిని పరిశీలించాలని కేంద్ర కేబినెట్ అనుకుంటోంది. ఈరోజు కేబినెట్ సమావేశంలో దీని గురించి చర్చిస్తారని... నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తారని సమాచారం. బీజేపీ ప్రభుత్వం(BJP Government) ఈ మధ్య కాలంలో వరుసగా పలువురు దివంగత నేతలకు భారత రత్నలు ప్రకటించింది. తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు(PM PV Narasimha Rao) కు కూడా భారత రత్న ఇచ్చింది. ఇప్పుడు అదే కోవలో ఎన్టీయార్‌కు కూడా భారతరత్న ఇవ్వొచ్చని అంటున్నారు. ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం నిర్వహించే చివరి కేంద్ర కేబినెట్ సమావేశం ఇదే. అందుకే ఇందులో ఎన్టీయార్ భారత రత్న విషయం మీద నిర్ణయం కచ్చితంగా తీసుకుంటారని చెబుతున్నారు.

పొత్తు ముందు మాటలు..

ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) లో టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) లు పొత్తు పెట్టుకున్నాయి. ఈ పొత్తులో భాగంగా ఆంధ్రలో బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు ఇచ్చే ఒప్పందం కూడా పెట్టుకుంది. ఈ పొత్తు ఒప్పందానికి ఎన్డీయే నేతలతో చర్చించినప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీయార్‌కు భారత రత్న ఇవ్వాలనే విషయం మీద కూడా చర్చించారని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీయార్‌కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆయనకు భారతరత్న ఇస్తే...తద్వారా టీడీపీ మద్దుతు భారీగా రావడమే కాకుండా ఓటర్ల నుంచి కూడా పాజిటివిటీ వస్తుందని బీజేపీ భావిస్తోంది. అందుకే చంద్రబాబు నాయుడుతో చర్చలు తర్వాత ఎన్టీయార్‌కు కేంద్రం భారతరత్న ఇవ్వాలని డిసైడ్ అయిందని...దాని మీదనే ఇవాళ కేబినెట్‌లో చర్చ చేయనున్నారని తెలుస్తోంది.

తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీయార్...

తెలగువారికి ఆరాధ్యుడు ఎన్టీయార్. వారికి దేవుడంటే ఆయనే. రామారావు పోషించిన రాముడు, కృష్ణుడు పాత్రలను తెలుగువారే కాదు..యావత్ భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేరు. అంతలా ఆయన అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వెండితెరపై అందాల రాముడైనా … కొంటె కృష్ణుడైనా ..ఏడుకొండల వాడైనా..ఇలా ఏ పాత్రయినా ఆయన చేస్తేనే ఆ పాత్రకు నిండుదనం వస్తుంది. అంతేకాదు రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన ముఖ్యమంత్రిగా అనితర సాధ్యుడు అనిపించుకున్నారు నందమూరి తారక రామారావు. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లో కూడా అతి తక్కువ సమయంలోనే సంచలనం సృష్టించారు ఎన్టీయార్. 13 యేళ్లు రాజకీయ జీవితంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.

ఇక నటన విషయానికి వస్తే మకుటం లేని మమారాజు ఆయన. సాంఘిక, జానపద, చారిత్రక సినిమాలేవైనా.. అతను నటిస్తే ఆ పాత్ర పరిపూర్ణమవుతుంది. తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. తనలోనే దేవుడిని చూపించిన అరుదైన నటుడు నందమూరి రామారావు. ఎన్టీఆర్ పేరు చెబితే చాలు తెలుగు గడ్డ పులకించిపోతుంది. తెలుగు వారి హృదయాలోలో సంబరం మొదలవుతుంది. నటుడిగానే కాకుండా..దర్శకుడిగా..నిర్మాతగా స్టూడియో అధినేతగా…రాజకీయ వేత్తగా….ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను సృష్టించిన బహుముఖ ప్రఙ్ఞాశాలి. తెలుగు ప్రజలందరి చేత అన్నా అని పిలుపించుకున్న ఒకే ఒక్క మహానటుడు ఎన్టీఆర్. ఆయన నటంచిన చిత్రాల్లో దాదాపు 97 శాతం చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించడం విశేషం. తన సినీ కెరీర్‌లో 48 చిత్రాల్లో పౌరాణిక పాత్రల్లో నటించారు ఎన్టీయార్. తెలుగులో ఇలాంటి రేర్ రికార్డు ఎవరికీ లేదు. అంతేకాదు ఆయన సినిమాలు మళ్లీ రిలీజైతే.. మళ్లీ మొత్తం పెట్టుబడి తిరిగి రాబట్టగలగడం ఎన్టీఆర్‌కే సాధ్యమైంది. నటించిన 302చిత్రాల్లో 275 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. అందులో 23కు పైగా చిత్రాలు యేడాది పైగా నడిచాయి. ఈయన నటించిన 94 చిత్రాలు 300 రోజులు పూర్తి చేసుకున్నాయి. 185 సినిమాలు 175 రోజుల సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న ఘనత ఒక్క ఎన్టీయార్‌కే దక్కుతుంది.

Also Read : Andhra Pradesh : పిఠాపురంలో ఫ్లెక్సీల వార్..

Advertisment
తాజా కథనాలు