Dk with Chandrababu:చంద్రబాబుతో డీకె శివకుమార్.. పక్కకు వెళ్ళి ఏం మాట్లాడుకున్నారో?

టీడీపీ అధినేత చంద్రబాబు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకె శివకుమార్ బెంగళూరు ఎయిర్ పోర్ట్‌లో ఎదురుపడ్డారు. ఇద్దరూ పలకరించుకున్నారు. అందరికీ దూరంగా ఇద్దరూ వెళ్ళి మాట్లాడుకున్నారు. ఈ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

New Update
Dk with Chandrababu:చంద్రబాబుతో డీకె శివకుమార్.. పక్కకు వెళ్ళి ఏం మాట్లాడుకున్నారో?

Chandrababu Naidu v/s DK Shiva Kumar : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shiva Kumar) ఒకరికొకరు అనుకోకుండా ఎదురు పడ్డారు. బెంగళూరు ఎయిర్ పోర్టులో ఇద్దరూ కలుసుకున్నారు. చంద్రబాబు బెంగళూరు పర్యటన ఈరోజుతో ముగిసింది. దీంతో ఆయన అక్కడి నుంచి కుప్పానికి వెళ్ళేందుకు బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టు(HAL Airport) కు వచ్చారు. కరెక్ట్‌గా అదే సమయానికి డీకే శివకుమార్ కూడా అక్కడ ఉన్నారు. దీంతో ఇద్దరు నేతలు ఒకరికొకరు ఎదురుపడ్డారు, పలకరించుకున్నారు. కానీ దీని తర్వాత జరిగినదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరూ తమ పర్సనల్ సెక్యూరిటీని దూరంగా ఉండమని సైగ చేసి కాస్త పక్కకి వెళ్లి సీక్రెట్ గా కాసేపు మాట్లాడుకున్నారు. వాళ్ళు ఎందుకు అలా చేశారు? ఏం మాట్లాడుకుని ఉంటారు అని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Also Read:మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కేసులో ట్విస్ట్ లు

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో పాటూ అదే టైమ్‌లో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉంది. దీంతో ఇక్కడి రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికలే టార్గెట్‌గా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అక్కడ టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇక కాంగ్రెస్ కూడా ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలన్న దాని మీద చర్చలు చేస్తోంది.అధిష్టానం కూడా దృష్టి పెట్టింది. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్‌లోకి వస్తారని..పార్టీ పగ్గాలు, ఎన్నికల బాధ్యత ఆమెకు అప్పగిస్తారని అంటున్నారు. దీంతో పాటూ టీడీపీ, జనసేనతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశం కూడా ఉందని అంటున్నారు. అధిష్టానం ఆ దిశగా ఆలోచిస్తోందని టాక్ నడుస్తోంది. ఇందులో కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకె శివకుమార్ కీలకపాత్ర పోషిస్తారని కూడా చెబుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు, శివకుమార్ పక్కకు వెళ్ళి మాట్లాడుకోవడంతో ఆ విషయమే చర్చించుకున్నారా అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. సెక్యూరిటీని దూరంగా ఉండమని మాట్లాడుకునే విషయాలు ఇంతకు మించి ఏం ఉంటాయని అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు