IRCTC:ట్రైన్ బుకింగ్‌లో అదిరిపోయే ఫీచర్..అదిరిపోయింది గురూ రైల్లో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్సీటీసీ. ఓ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెడుతున్నామని...వింటే ఎగిరి గంతేస్తారని అంటోంది. ఇక మీదట ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న వెంటనే డబ్బులు చెల్లించక్కర్లేదని చెబుతోంది. మరిన్ని వివరాలు కింద చదవండి.. By Manogna alamuru 18 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి New Feature in train ticket:రైల్వే శాఖ ఓ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని గురించి మీకు తెలుసా అని అడుగుతోంది. అది కనుక తెలిస్తే మీరుసూపర్ థ్రిల్ అయిపోతారని చెబుతోంది. ఇక మీదట ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే అస్సలు శ్రమ పడక్కర్లేదని అంటోంది. ఇప్పుడు ప్రాసెస్ చాలా సులభం అయిపోయిందని వివరిస్తోంది. మామూలుగా అయితే ఎక్కడికైనా వెళ్ళాలంటే ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడే డబ్బులు చెల్లించాలి. అది కన్ఫామ్ అయిందా, వెయింట్ లిస్ట్‌లో ఉందా అనే దానితో సంబంధం లేకుండా పే చేయాల్సిందే. కానీ ఇప్పుడ అలా కాదు. కన్ఫామ్ అయ్యాకే డబ్బులు.. తాజాగా ఐఆర్సీటీసీ ఓ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. దీనిలో టికెట్ బుక్ చేసుకున్న వెంటనే డబ్బులు చెల్లించక్కర్లేదు. ఎప్పటిలానే టికెట్ బుక్ చేసుకోవాలి కానీ డబ్బులు మాత్రం టికెట్ కన్ఫామ్ అయ్యాకనే డిడక్ట్ అవుతాయి. దీని కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహించే గేట్ వే ఐ-పేని ఉపయోగించాల్సి ఉంటుంది. దీన్నే ఆటో పే అంటారు. ఈ సదుపాయాన్ని ఐఆర్సీటీసీ ఐపే, యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌ల ద్వారా చేసుకోవచ్చును. రైల్ టికెట్ కోసం పీఎన్ఆర్ నెంబర్‌ను రూపొందించిన తర్వాత మాత్రమే వినియోగదారుల బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. ఇది ఎలా ఉపయోగం అంటే.. పెద్ద మొత్తంలో ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునేవారికి ఇది ఉపయోగింగా ఉంటుంది. వెయిటింగ్ లిస్ట్, జనరల్, తత్కాల్ టికెట్‌ను బుక్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా ప్రయోజనం. ముఖ్యంగా ప్రయాణికులు డబ్బులు చెల్లించినా బెర్త్ ఛాయిస్ నాట్ మెట్ లేదా నో రూమ్ లాంటి సందర్భాల్లో ఆలోపై చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే ఛార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా తత్కాల్ వెయిట్ లిస్ట్ చేయబడిన ఇ-టికెట్ వెయిట్ లిస్ట్‌లో ఉంటే...అలాంటి సందర్భాల్లో వర్తించే ఛార్జీలు చెల్లించినా ఆటో ఫీచర్ సాయంతో వెనక్కి తిరిగి పొందవచ్చును. ఇన్స్టంట్ రీఫండ్.. వెయిట్ టికెట్ బెక్ చేసుకున్నాక...అది కన్ఫార్మ్ కాకపోయినా డబ్బులు కట్ అయితే అవి ముడు నాలుగు రోజుల్లో ఐపే ద్వారా తిరిగి వచ్చేస్తాయి. బుకింగ్ మొత్తం ఎక్కువగా ఉంటే దాని కోసం తక్షణ రీఫండ్ పొందడం వలన అదనపు ఛార్జీలు లేకుండా వ్యక్తిగత బుక్ ప్రత్యామ్నాయ్ రవాణా ఎంపికలకు సహాయం చేస్తుంది. అయితే ఒక వ్యక్తి వెయిట్ లిస్ట్ టికెట్‌లను బుక్ చేయడానికి ఐఆర్సీటీసీ ఆటోపే ఫీచర్‌ని ఉపయోగించినప్పుడు టికెట్ కన్ఫామ్ కాకపోతే వెంటనే ఆ డబ్బులు మన అకౌంట్‌కు రిటర్న్ అవుతాయి. Also Read:Telangana : రైతుబంధు డబ్బులపై అన్నదాతల్లో కన్ఫ్యూజన్ #money #new-feature #booking #irctc #train-ticket మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి