Israel-Hamas War: ఇజ్రాయెల్‌పై దాడికి ముందు ఆ దేశం హమాస్ మిలిటెంట్లకు శిక్షణ

హమాస్ మిలిటెంట్లను అంతం చేసేందుకు గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు జరుపుతున్న నేపథ్యంలో ఓ సంచలన విషయం బయటపడింది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడులు చేయడానికి కొన్నిరోజుల ముందే.. వందలాది హమాస్, పీఐజే మిలిటెంట్లకు ఇరాన్ శిక్షణ ఇచ్చినట్లు తాజాగా ఓ వార్తా కథనంలో రావడం చర్చనీయం అవుతోంది.

New Update
Israel-Hamas War: ఇజ్రాయెల్‌పై దాడికి ముందు ఆ దేశం హమాస్ మిలిటెంట్లకు శిక్షణ

ప్రస్తుతం గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో విరుచుకుపడుతోంది. ఇప్పటికే తమ దేశంపై హమాస్ మిలిటెంట్లు చేసిన భీకర దాడి వెనుక ఇరాన్ హస్తం ఉందని ఇజ్రాయెల్ ఆరోపణలు చేస్తూనే ఉంది. అయితే ఇప్పుడు వీటికి సంబంధించి ఓ సంచలన విషయం బయటపడింది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే దాడులు చేయడానికి కొన్నిరోజుల ముందే.. వందలాది హమాస్, పీఐజే మిలిటెంట్లకు ఇరాన్ శిక్షణ ఇచ్చినట్లు తాజాగా ఓ వార్తా కథనంలో రావడం చర్చనీయాంశమవుతోంది.

ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్.. సెప్టెంబర్‌లో దాదాపు 500 మంది హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ మిలిటెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' ఓ కథనాన్ని వెల్లడించింది. నిఘా సంస్థలకు చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఈ కథనాన్ని ప్రచూరించింది. ఇక ఇరానియన్ బ్రిగేడియర్ జనరల్ ఇస్మాయిల్ ఖానీ కూడా ఈ శిక్షణా కార్యకలాపాలను పర్యవేక్షించినట్లు అందులో వెల్లడించారు. అలాగే అక్టోబర్ 7 దాడికి ఐదురోజుల ముందు లెబనాన్ రాజధాని అయిన బీరట్‌లో జరిగినటువంటి ఓ సమావేశంలో ఇజ్రాయెల్‌పై హమాస్, హెజ్‌బొల్లా ప్రతినిధులు అలాగే ఇరాన్ భద్రతా అధికారులు ఈ దాడుల గురించి చర్చలు జరిపినట్లు పేర్కొంది.

Also Read: హమాస్‌ను ఉగ్రసంస్థగా గుర్తించాలని భారత్‌ను కోరిన ఇజ్రాయెల్

మరో విషయం ఏంటంటే ఆగస్టు నుంచి జరిగిన ఈ సమావేశాల్లో కనీసం రెండు సమావేశాలకు ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా హాజరైనట్లు పలు విశ్వసనీయా వర్గాలు తెలిపాయి. తమ దేశంపై హమాస్ దాడి చేయడం వెనుకు ఇరాన్ హస్తం ఉందని ఇజ్రాయెల్ ఆరోపణలు చేస్తూనే ఉంది. అయితే ఈ కథనం వెలువడడానికి కొద్ది గంటల ముందు కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికార ప్రతినిధి డేనియల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధానికి ముందు శిక్షణ, ఆయుధాల సరఫరా అలాగే ఆర్థికపరంగా, సాంకేతిపరంగా హమాస్‌కు ఇరాన్ సాయం అందించిందని.. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉందని తెలిపారు. మరోవైపు ఇటీవల అమెరికా కూడా తమకు హమాస్ మిలిటెంట్లకు ఇరాన్ మద్దతు ఉందని చెప్పడంలో ఎలాంటి రహస్యం లేదని చెప్పింది. అయితే హమాస్ దాడిలో ఇరాన్ అధికారులకు నేరుగా సంబంధాలు ఉన్నట్లు చెప్పేందుకు సరైన ఆధారాలు లేవని పేర్కొంది. ఇక ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిని ఇరాన్ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు