ఒక బైక్‌ మీద ఏడుగురు ప్రయాణం..గాల్లో కలిసిపోతాయి అంటూ సజ్జనార్ హెచ్చరిక!

ఒక బైక్‌ మీద ముగ్గురు కాదు..నలుగురు కాదు ఏకంగా ఏడుగురు ప్రయాణించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియోలో వైరల్‌ గా మారింది. ఈ వీడియోను తెలంగాణ ఐపీఎస్‌ ఆఫీసర్‌ సజ్జనార్‌ తన ట్విట్టర్‌ లో షేర్‌ చేశారు.

ఒక బైక్‌ మీద ఏడుగురు ప్రయాణం..గాల్లో కలిసిపోతాయి అంటూ సజ్జనార్ హెచ్చరిక!
New Update

బైక్‌ అంటే ఒకరు లేదా ఇద్దరు బాగా అయితే ముగ్గురు ప్రయాణిస్తారు. కానీ ట్రిపుల్‌ రైడింగ్‌ డేంజర్‌ అని పోలీసులు శిక్ష వేస్తారు. కానీ ఒక బైక్‌ మీద ముగ్గురు కాదు..నలుగురు కాదు ఏకంగా ఏడుగురు ప్రయాణించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియోలో వైరల్‌ గా మారింది. ఈ వీడియోను తెలంగాణ ఐపీఎస్‌ ఆఫీసర్‌ సజ్జనార్‌ తన ట్విట్టర్‌ లో షేర్‌ చేశారు.

అసలు ఒక బైక్‌ మీద ముగ్గురు కూర్చుంటేనే చోటు సరిపోదు. అలాంటిది ఒకేదాని మీద ఏడుగురు ప్రయాణం అంటే అది బైకా..లేక ఆటోనా? అని చాలా మందికి అనుమానం కూడా వస్తుంది.

అసలు ఒక దాని మీద ఏడుగురు కూర్చువడమే కాకుండా ఎంత స్పీడ్‌ గా రోడ్డు మీద దూసుకుపోతున్నారంటే..చూసేవాళ్లకే భయం వేసేలాగా ఉంది. ఈ దృశ్యాన్ని బైక్‌ పక్క నుంచి వెళ్తున్న ఓ కార్‌ లోని వ్యక్తులు వీడియో తీయడంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ బైక్‌ పైన నడిపే వ్యక్తి పెట్రోల్‌ ట్యాంక్‌ పైన కూర్చుని ఉండగా..అతని వెనుక ఐదుగురు కూర్చున్నారు. ఇక్కడికి మొత్తం ఆరుగురు కాగా ఏడవ వాడు చివర కూర్చున్న వ్యక్తి భుజాల పై కూర్చున్నాడు. ఈ దృశ్యం ఉత్తరప్రదేశ్లోని హపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ విషయం గురించి సజ్జనార్ స్పందించారు.

గాల్లో కలిసిపోతాయి:సజ్జనార్‌!

ఇటువంటి ప్రయాణాలు చేస్తే ప్రాణాలే పోతాయి అంటూ హెచ్చరించారు. బైక్‌ మీద ఇలాంటి ప్రయాణాలు యమ డేంజర్‌ అంటూ రాసుకొచ్చారు. ఏమాత్రం తేడా వచ్చిన ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర ప్రయాణాలు చేయడం సరికాదు. బైక్‌లపై ఇద్దరు కంటే ఎక్కువమంది ప్రయాణించడం చట్టవిరుద్దం అంటూ పేర్కొన్నారు.

#telangana #warning #sajjanar #uttarapradesh #bike-riding
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe