Rohit Sharma: RCBకి రోహిత్ శర్మ..? పూనకాలు లోడింగ్...! ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఒకవేళ రోహిత్ శర్మను వదులుకుంటే బిడ్డింగ్ వేసేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిద్ధంగా ఉందన్న 'thecricketlounge' వెబ్‌సైట్ ఆర్టికల్ వైరల్‌గా మారింది. అయితే రోహిత్‌ను ముంబై వదులుకోదని కుండబద్దలు కొడుతున్నారు హిట్‌మ్యాన్ ఫ్యాన్స్! By Trinath 25 Nov 2023 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి IPL AUCTION 2024: ఐపీఎల్‌లో ప్లేయర్ల రిటెన్షన్‌కి రేపే(నవంబర్ 26) లాస్ట్ డేట్. దీంతో సోషల్‌మీడియాలో పలు రకాల పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. రోహిత్ గుజరాత్‌కి వెళ్తాడని.. హార్దిక్ పాండ్యా(Hardik Pandya) తిరిగి ముంబైకి వస్తాడని పలు న్యూస్ వెబ్‌సైట్స్ పలు కథనాలు ప్రచురించాయి. అయితే ప్రముఖ క్రికెట్ సైట్ 'ESPN CricInfo' కూడా ఈ ట్రేడ్‌పై ఓ ఆర్టికల్‌ని పబ్లిష్ చేసింది. రూ.15కోట్ల క్యాష్ ట్రేడింగ్‌తో పాండ్యాను ముంబై కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని ప్రచురించింది. అయితే గుజరాత్‌కు రోహిత్ వెళ్తున్నాడన్న వార్తలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో రోహిత్ గుజరాత్‌కు వెళ్తున్నాడన్న వార్త పుకారే కావొచ్చు. ఇదే సమయంలో మరో వార్త తెగ వైరల్ అవుతోంది. Also Read: మళ్ళీ సొంతగూడు ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా? RCBకి రోహిత్ శర్మ..? రోహిత్ శర్మను తీసుకునేందుకు రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు(RCB) ఆసక్తి కనబరుస్తోందని 'thecricketlounge' అనే వెబ్‌సైట్ ఓ ఆర్టికల్‌ను పబ్లిష్ చేసింది. ఒకవేళ ముంబై రోహిత్ శర్మను లీవ్ చేస్తే రోహిత్ కోసం ఆర్సీబీ బిడ్డింగ్ వెయ్యనున్నట్లు రాసింది. ప్రస్తుతం రోహిత్ వయసు 36. దీంతో భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా రోహిత్‌ను ముంబై వదిలేసే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంద. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం ఉండదని హార్డ్‌కోర్ ముంబై ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ముంబైకి రోహిత్ కెప్టెన్‌గా ఐదు ట్రోఫీలు అందించాడు. ఐపీఎల్ మూడు వరకు హైదరాబాద్‌కు ఆడాడు రోహిత్. 2009 ఐపీఎల్ ట్రోఫిని గెలుచుకున్న డెక్కన్ ఛార్జెర్స్ జట్టులోనూ రోహిత్ సభ్యుడు. కీలక ఆటగాడు కూడా. అయితే తర్వాత రోహిత్ తన సొంత సిటీ అయిన ముంబైకి రావడం ఐపీఎల్-6లో కెప్టెన్‌గా మారడం.. ఐదు సార్లు ముంబైని విశ్వవిజేతగా నిలపడాన్ని ముంబై ఫ్యాన్స్ జీవిత కాలం గుర్తుపెట్టుకుంటారు. అందుకే ఐపీఎల్ రిటైర్‌మెంట్ వరకు రోహిత్ ముంబైకే ఆడాలని ఆ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వన్డే ప్రపంచ కప్ ముగియడంతో క్రికెట్ అభిమానులు ఆసక్తిగా తమ దృష్టిని డిసెంబర్ 19, 2023న దుబాయ్‌లో జరగనున్న ఐసీఎల్ వేలం వైపు మళ్లించారు. రేపటికి తమ రిటైన్ చేసుకున్న, విడుదల చేసిన ఆటగాళ్లను ప్రకటించాల్సిన బాధ్యత ఫ్రాంచైజీలకు ఉంది. దీంతో పలు వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. Also Read: దండం సామి.. మీ ముగ్గురు ఇక దయచేయండి.. రూ.31 కోట్లు సేవ్ చేసుకునే ప్లాన్‌లో సన్‌రైజర్స్! WATCH: #mumbai-indians #cricket #ipl #royal-challengers-bangalore #ipl-auction-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి