Vijay Sales : కొత్తగా ఫోన్ కొనుగోలు చేయలనుకునేవారికి రిపబ్లిక్ డే(Republic Day) మంచి ఛాన్స్ అనే చెప్పాలి. ప్రతీ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా వారం రోజుల ముందు నుంచే మొబైల్ కంపెనీ(Mobile Company) లతో పాటు ఫ్లిప్‌కార్ట్(Flipkart), అమెజాన్(Amazon) లాంటి సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. విజయ్ సేల్స్ లో కొనసాగుతున్న రిపబ్లిక్ డే సేల్(Republic Day Sale) సందర్భంగా, కొనుగోలుదారులు కొత్తగా ప్రారంభించిన యాపిల్ ఐఫోన్-15(Apple iPhone-15) ని రూ. 68,990కి పొందవచ్చు. ఐఫోన్ 15 భారత్‌లో రూ.79,990 ప్రారంభ ధరతో ఉంటుంది. విజయ సేల్స్(Vijay Sales) లో భాగంగా రూ.11,000 వరకు తగ్గింపుతో విక్రయిస్తున్నారు.
Also Read : అయోధ్య రామ మందిరం.. 500 సంవత్సరాల గాయానికి కుట్టు లాంటిది : అమిత్ షా!
బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై మరింత తగ్గింపు :
రూ. 79,900 ప్రారంభ ధరతో ఉన్న ఐఫోన్ యాపిల్-15 ప్రస్తుతం జరుగుతున్న రిపబ్లిక్ డే సేల్‌లో విజయ్ సేల్స్‌లో రూ. 72,990 వద్ద లిస్ట్ చేసి ఉంది. చేయబడింది. దీనితో పాటు, కొనుగోలుదారులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(HDFC Bank) క్రెడిట్ కార్డ్‌లపై రూ.4,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. అంటే ఓవరాల్‌గా రూ.11వేల వరకు సేవ్ చేసుకునే అవకాశం ఉంది. ఐఫోన్ 15తో పాటు, యాపిల్ ఐఫోన్-13 ప్రారంభ ధర రూ. 51,999 వద్ద విక్రయిస్తున్నారు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై కొనుగోలుదారులు రూ. 1,000 అదనపు తగ్గింపును పొందుతారు. మరోవైపు యాపిల్ ఐఫోన్-15 ప్రో మ్యాక్స్ రూ. 1,49,400కి అందుబాటులో ఉంది.
మిగిలిన ఫోన్లపైనా తగ్గింపు:
కొనుగోలుదారులు ఎంట్రీ-లెవల్, మిడిల్-లెవల్ విభాగంలో ఇతర స్మార్ట్‌ఫోన్(Smartphone) లపై కూడా ఆఫర్‌లను పొందుతారు. ప్రివ్యూ పేజీ ప్రకారం, Redmi 13C 5G రూ. 13,999 నుంచి తగ్గి రూ. 10,999కి అందుబాటులో ఉంటుంది. మరోవైపు వినియోగదారులు ఇటీవల విడుదల చేసిన శాంసంగ్ గ్యాలెక్సీ S24 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను కనిష్ట ధర INR 2,000తో ప్రీ-బుక్ చేయవచ్చు. విజయ్ సేల్స్ సమయంలో స్మార్ట్ వాచ్‌లు, ఇయర్‌బడ్స్, టాబ్లెట్‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, గృహోపకరణాలపై డిస్కౌంట్లను కూడా అందిస్తున్నారు.
Also Read: జాతీయ బాలికా దినోత్సవం .. జనవరి 24నే ఎందుకు?
WATCH: