Kamala Haaris: పుతిన్‌ ని కలవను..తేల్చి చెప్పిన కమలా హారీస్‌!

తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే పుతిన్‌ ను కలవనని కమలా హరీస్‌ అన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ ల శాంతి చర్చల్లో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ని కలిసే ప్రసక్తే లేదని ఆమె తేల్చిచెప్పారు.

New Update
America Elections: అగ్రరాజ్య ఎన్నికల ప్రచారంలో నాటు నాటు పాట!

Kamala Haris:అమెరికాలో వచ్చే నెలలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే రష్యా-ఉక్రెయిన్‌ ల శాంతి చర్చల్లో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ని కలిసే ప్రసక్తే లేదని తెల్చిచెప్పారు.

Also Read: ఆహారంలో ఈ విత్తనాలు తీసుకుంటే మీ జుట్టు పెరగడం ఖాయం!

రష్యా-ఉక్రెయిన్‌ ల మధ్య యుద్ధం నేపథ్యంలో వారి మధ్య శాంతి చర్చల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ని కలుస్తారా అని మాఎను ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆమె ఈ మేరకు బదులిచ్చారు. ఉక్రెయిన్‌ లేకుండా ద్వైపాక్షిక చర్చలు కావు. ఉక్రెయిన్‌ భవిష్యత్తు పై ఆ దేశమే చెప్పాలని ఆమె అన్నారు.

Also Read: అజ్మేర్‌ లో  విజయవాడ న్యాయవాదుల బస్సుకు ప్రమాదం..ఒకరి మృతి!

ఉక్రెయిన్‌ పై రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాల పై హారిస్‌ విమర్శలను పునరుద్ఘాటించారు. ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉండి ఉంటే పుతిన్‌ ప్రస్తుతం ఉక్రెయిన్‌ లోని కైవ్‌ లో అధికారాన్ని సాధించేవారన్నారు.

ఆయన వెన్నంటే ఉంటా..

వచ్చే నెల అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ నకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్‌ అధ్యక్షుడయ్యే వరకు తాను వెన్నంటే ఉంటానని మస్క్‌ వెల్లడించారు. టాకర్‌ కార్లసన్‌ తో జరిగిన ఈ ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒకవేళ ట్రంప్‌ గెలవకపోతే అమెరికాకు ఇవే చివరి ఎన్నికలని మస్క్‌ అన్నారు.

Also Read: హర్యానాలో చేతులెత్తేసిన JJP

డెమోక్రాట్లు గెలిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే వలసదారుల పై స్పందించిన మస్క్‌...వారిని కావాలనే రాష్ట్రాలు దాటిస్తున్నట్లు చెప్పారు. అమెరికాను డెమోక్రాట్లు పాలిస్తే చట్ట విరుద్దమైన చర్యలను అమలు చేస్తారన్నారు. 

Also Read: సజీవంగానే హమాస్‌ అధినేత!

Advertisment
తాజా కథనాలు