BIG BREAKING: మేయర్‌పై కత్తిపోట్లు.. సిటీలో కలకలం!

పశ్చిమ జర్మనీలోని హెర్డెక్కే పట్టణానికి కొత్తగా ఎన్నికైన మేయర్ ఐరిస్ స్టాల్జర్ కత్తిపోట్లకు గురయ్యారు. ఆమె ఇంటిలో తీవ్ర గాయాలతో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే రెస్క్యూ టీం హెలికాప్టర్‌లో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

New Update
Mayor

Mayor

పశ్చిమ జర్మనీలోని హెర్డెక్కే పట్టణానికి కొత్తగా ఎన్నికైన మేయర్ ఐరిస్ స్టాల్జర్ కత్తిపోట్లకు గురయ్యారు. ఆమె ఇంటిలో తీవ్ర గాయాలతో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే రెస్క్యూ టీం హెలికాప్టర్‌లో ఆమెను ఆసుపత్రికు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై జర్మనీ ఛాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ తీవ్రంగా స్పందించారు. ఇది ఒక ఘోరమైన చర్యగా విమర్శించారు. ఐరిస్‌ స్టాల్జర్‌ పూర్తిగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. 57 ఏళ్ల ఐరిస్ స్టాల్జర్ సెంటర్-లెఫ్ట్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ (SPD) సభ్యురాలు. సెప్టెంబర్‌లో జరిగిన మేయర్ ఎన్నికల్లో స్టాల్జర్ విజయం సాధించారు.

ఇది కూడా చూడండి: H-1B Visa: హెచ్ 1బీ హోల్డర్లు ప్రయాణాలు వద్దు..కాలిఫోర్నియా యూనివర్శిటీ వార్నింగ్

ఇది కూడా చూడండి: Russia-Ukraine War: ఉక్రెయిన్ దళాల చేతిలో..రష్యా సైన్యంలోని భారతీయుడు..నిర్థారిస్తామన్న విదేశాంగ శాఖ

దత్తత తీసుకున్న కుమారుడే..

స్టాల్జర్ ఇద్దరు పిల్లలను తీసుకున్నారు. 17 ఏళ్ల కుమార్తెతో పాటు 15 ఏళ్ల కుమారుడును కూడా తీసుకున్నారు. అయితే వీరు మధ్యాహ్నం సమయంలో అత్యవసర కాల్ చేసి, అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న విలేకరులు ఒక యువకుడు పోలీసు పెట్రోల్ కారులోకి ప్రవేశించడం చూశారు. తరువాత పిల్లలను విచారణ కోసం తరలించారు. అయితే దత్తత తీసుకున్న 15 ఏళ్ల కొడుకు ఆమెను కత్తితో దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిందితుడిగా అదుపులోకి తీసుకున్నారు.

Advertisment
తాజా కథనాలు