Nobel peace Prize: నోబెల్ వచ్చింది..కానీ దాన్ని తీసుకుంటే జైలుకే..మరియా కొరీనాకు పెద్ద సమస్య

నోబెల్ శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కాదని.. వెనిజులా విపక్ష నేత మరియా కొరీనా మచాదోకు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆమె దానిని అందుకోవడానికి వస్తే ఆమె జైలుకు వెళ్ళాల్సి వస్తుంది. దీంతో ఆమె పెద్ద సందిగ్ధంలో పడ్డారు.

New Update
Nobel Peace Prize Winner Maria Corina Machado

Nobel Peace Prize Winner Maria Corina Machado

ఈ ఏడాది నొబెల్ శాంతి బహుమతి చాలానే చర్చకు దారి తీసింది. ఎంత ప్రయత్నించినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అది దక్కలేదు. వెనిజులా విపక్ష నేత మరియా కొరీనా మచాదోకు దక్కింది. దీనిని డిసెంబర్ 10న నార్వేలో ఈ అవార్డ్ ప్రదానోత్సవం జరగనుంది. ఇప్పుడు ఇందులో మచాదో పాల్గొంటారో లేదో అన్నది సందిగ్ధంలో పడింది. ఎందుకంటే ఆమె ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. దాదాపు ఏడాదిగా ఆమె ఎవరికీ కనిపించకుండా దాక్కున్నారు. అక్కడి నుంచే వెనిజులాలోని నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నారు. దీంతో ఈమెపై వెనిజులా ప్రభుత్వం విపరీతమైన కోపంతో ఉంది. మచాదోపై క్రిమినల్ కేసులను కూడా నమోదు చేసింది. ముఖ్యంగా కుట్రలు, విద్వేషాన్ని ప్రేరేపించడం, ఉగ్రవాదం వంటి అభియోగాలు ఉన్నాయని.. అందుకే ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా పరిగణిస్తున్నట్లు వెనిజులా అటార్నీ జనరల్ తారెక్ విలియం సాబ్ స్పష్టం చేశారు. బహుమతిని స్వీకరించడానికి దేశం దాటి బయటకు వెళ్తే.. ఆమెను పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని అన్నారు. 

డిసెంబర్ 10న..

అయితే డిసెంబర్ 10న నార్వేలో నోబెల్ బహుమతులను ప్రదానం చేస్తారు. స్వీడన్‌కు చెందిన ప్రముఖ సైంటిస్ట్, ఇంజినీర్, వ్యాపారవేత్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 10వ తేదీన నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. ఆ రోజున బహుమతితో పాటూ 10 లక్సల డాలర్లు ఇవ్వనున్నారు. 1901 నుంచి నోబెల్ బహుమతులను ఇస్తున్నారు. ఇప్పుడు మచాదో ఈ కార్యక్రమానికి వెళ్ళాలి. కాని ఆమె తనకు వచ్చిన శాంతి బహుమతిని అందుకోవాలంటే ఆమె అక్కడకు వెళ్ళాలి. కానీ బయటకు వస్తే..మచాదోను అరెస్ట్ చేస్తారు.

ఇక నార్వేజియన్ నోబెల్ కమిటీ.. వెనిజులా ప్రజల కోసం మరియా కొరినా మచాదో చేసిన అవిశ్రాంత కృషి, వారి హక్కుల కోసం చేసిన పోరాటం వల్లే ఆమెకు నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసినట్లు తెలిపింది. దాదాపు గత ఏడాది కాలంగా.. ప్రాణాలకు తీవ్రమైన ముప్పు ఉన్నప్పటికీ, ఆమె వెనిజులాలోనే అజ్ఞాతంలో ఉండి నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని వివరిస్తూనేకమిటీ ఆమెను 'శాంతి ఛాంపియన్‌'గా అభివర్ణించింది. ముఖ్యంగా లాటిన్ అమెరికాలో ప్రజల ధైర్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా చెప్పింది.

Advertisment
తాజా కథనాలు