khalistan: ఖలిస్తానీ ఉగ్ర గ్రూపులకు తమ నుంచే నిధులు..అంగీకరించిన కెనడా

దాదాపు రెండేళ్ళుగా కెనడా, ఇండియాల మధ్య ఖలిస్తానీల వివాదం నడుస్తోంది. ఆ ఉగ్రవాదాన్ని భారత్ పెంచి పోషిస్తోందని ఇన్నాళ్ళూ వాదించిన కెనడా..చివరకు తమ దేశం నుంచే వారికి ఆర్థిక సహాయం అందుతోందని అంగీకరించింది. 

New Update
khalistan

ఖలిస్తానీ ఉగ్రవాదులతో ముడిపడి ఉన్న ఉగ్రవాద నిధులపై కెనడా ప్రభుత్వం టెర్రర్ ఫైనాన్సింగ్ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. బబ్బర్ ఖల్సా, ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్, సిక్స్ ఫర్ జస్టిస్ వంటి ఖలిస్తానీ ఉగ్రవాద గ్రూపులను కెనడా పెంచి పోషిస్తోందని అందరికీ తెలిసిన విషయమే.  అయితే ఇప్పటి వరకూ కెనడా మాత్రం ఈ విషయాన్ని ఇప్పటి వరకూ ఒప్పుకోలేదు.  కానీ మొదటిసారి ఒట్టావా ఈ ఉగ్రవాద గ్రూపులు కెనడా నేల నుండి పనిచేస్తున్నాయని...అక్కడ నుంచే ఆర్థిక సహాయం పొందుతున్నాయని అంగీకరించింది. కెనడాలో మనీలాండరింగ్,  ఉగ్రవాద నిధులపై కెనడా ప్రభుత్వ ఆర్థిక శాఖ అంచనా వేసింది.  ఇందులో ఖలిస్తానీ గ్రూపులు కెనడాతో సహా అనేక దేశాలలో నిధులు సేకరిస్తున్నట్లు తేలింది. ఇదే విషయాన్ని కెనడా నివేదించింది. అంతేకాదు ఖలిస్తానీ ఉగ్రవాదులకు, హమాస్, హిజ్బుల్లా లాంటి ఇతర ఉగ్రవాద సంస్థలకూ మధ్య కూడా ఆర్థిక సంబంధాలున్నాయని తెలిపింది. హమాస్, హిజ్బుల్లాలకు కూడా కెనడా నుంచే నిధులు అందుతున్నాయని అక్కడి నిఘా సంస్థలు చెబుతున్నాయి. 

కెనడాలో విస్తృతమైన నిధుల సేకరణ..

ఖలిస్తానీ ఉగ్రవాద గ్రూపులు తమకు కావాల్సిన నిధులను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆటో దొంగతనాల ద్వారా కూడా సేకరిస్తోంది. దాంతో పాటూ విదేశాల నుంచీ వారికి డబ్బులు అందుతున్నాయని నిఘా సంస్థలు చెబుతున్నాయి. ఉగ్రవాద గ్రూపులకు కెనడాలో విస్తృతమైన నిధుల సేకరణ, నెట్ వర్క్ కలిగి ఉన్నాయని చెబుతోంది. ఈ గ్రూపులకు క్రౌడ్ ఫండింగ్,  క్రిప్టోకరెన్సీ ల ద్వారా విభిన్న పద్ధతుల ద్వారా కూడా నిధులు వస్తున్నాయని చెబుతున్నాయి. వీటిలో MSB, బ్యాంకింగ్ రంగాల దుర్వినియోగం, క్రిప్టోకరెన్సీల వాడకం, రాష్ట్ర ఫైనాన్సింగ్, విరాళాలు, NPO రంగ దుర్వినియోగం,  నేర కార్యకలాపాలు ద్వారా ఉగ్ర గ్రూపులకు నిధులు అందుతున్నాయని నివేదికలు తెలిపాయి.

దీనికన్నా ముందే  తమ దేశం నుంచే ఖలిస్థానీ ఉగ్రవాదులు కుట్రలకు ప్లాన్ చేస్తున్నారని కెనడా ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో అంగీకరించింది. ఈ విషయం భారత్ ఎప్పటి నుంచో చెబుతున్నా కెనడా అంగీకరించలేదు. సంవత్సరాలుగా దీనిపై చర్యలు కూడా తీసుకోలేదు. కెనడా మాజీ ప్రధాని ట్రూడో భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను చూస్తూ మౌనంగా ఉన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కారణంగా రెండు దేశాల మధ్యనా ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకున్నాయి. కొన్ని నెలల పాటూ ఇరు దేశాలు తమ దౌత్య సంబంధాలను పక్కన పెట్టేశాయి. కెనడా కొత్త ప్రధాని మార్క్ వచ్చిన తర్వాతనే మళ్ళీ ఇండియాతో సంబంధాలు మెరుగు అవుతున్నాయి. కేవలం కెనడా మాత్రమే కాదు ఆస్ట్రేలియాలో కూడా ఖలిస్థానీయులు పెరిగిపోయారు. తాజాగా కెనడా నుంచే ఉగ్ర గ్రూపులకు నిధులు అందుతున్నాయని తేలడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. 

Also Read: Peter Navarro: మరోసారి రెచ్చిపోయిన పీటర్ నవార్రో..ఈ సారి ఎక్స్ పై కూడా..

Advertisment
తాజా కథనాలు