Russia-Ukraine War: జూన్‌ నాటికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగించాలి.. అమెరికా హెచ్చరిక

నాలుగేళ్ల క్రితం మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఏడాది జూన్ నాటికి యుద్ధం ముగించాలని రష్యా, ఉక్రెయిన్‌కు అమెరికా గడువు విధించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.

New Update
US wants Russia and Ukraine to end war by June

US wants Russia and Ukraine to end war by June

 నాలుగేళ్ల క్రితం మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ మళ్లీ ఇరుదేశాలు దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఏడాది జూన్ నాటికి యుద్ధం ముగించాలని రష్యా, ఉక్రెయిన్‌కు అమెరికా గడువు విధించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. 

ఈ వేసవి ప్రారంభం అయ్యే లోపు యుద్ధాన్ని ముగించాలని అమెరికా ప్రతిపాదిస్తుందని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం యుద్ధం ఆగకుంటే ఇరుదేశాలపై వాళ్లు ఒత్తిడి తీసుకొచ్చే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. జూన్ నాటికి అన్ని వ్యవహారాలను ఆపివేయాలని అంటున్నట్లు చెప్పారు. మరో రౌండ్‌ చర్చలకు అమెరికా ఆతిథ్యం ఇవ్వనుందని.. ఈ త్రైపాక్షిక చర్చలు మయామీలో జరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. 

Also Read: చరిత్ర సృష్టించిన భారత ప్రైవేటు అంతరిక్ష సంస్థ.. స్పేస్‌లో ISS ఫొటోలు.. ఇక శత్రు దేశాలకు వణుకే

ఇటీవల అమెరికా మధ్యవర్తిత్వంతో రష్యా-ఉక్రెయిన్ చర్చలు అబుధాబీలో జరిగాయి. అయినప్పటికీ ఇందులో ఎలాంటి పురోగతి లేదు. రెండు దేశాలు కూడా తమ డిమాండ్ల నుంచి వెనకడుగు వేయలేదు. డాన్‌బాస్‌ ప్రాంతంలో ఉన్న ఉక్రెయిన్‌ దళాలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని రష్యా డిమాండ్ చేస్తోంది. దీన్ని ఉక్రెయిన్ అంగీకరించడం లేదు.   

Also Read: అనిల్‌ అంబానికి స్వీడన్ మహిళను ఆఫర్ చేసిన ఎప్‌స్టీన్‌.. వెలుగులోకి సంచలన నిజాలు

మరోవైపు రష్యా నియంత్రణలో ఉన్న జపోరియా అణుకేంద్రాన్ని ఎవరు నిర్వహించారనేదానిపై కూడా క్లారిటీ లేదని జెలెన్‌స్కీ అన్నారు. డాన్‌బాస్‌ను స్వేచ్ఛా వాణిజ్య మండలంగా మార్చాలని అమెరికా ప్రతిపాదనలు చేస్తోందని తెలిపారు. అయితే ఇది అమలవుతుందా లేదా అనేది తనకు తెలియదన్నారు. దీనిపై తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు స్పష్టం చేశారు. 

Advertisment
తాజా కథనాలు