USA: గోల్డ్ కార్డ్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన అమెరికా అధ్యక్షుడు

ధనవంతుల కోసం ప్రవేశపెట్టిన అమెరికా పౌరసత్వ గోల్డ్ కార్డు ఫస్ట్ లుక్ ను అధ్యక్షుడు ట్రంప్ విడుదల చేశారు.  ఈరోజు జరిగిన ఎయిర్ ఫోర్స్ వన్ లో మీడియాతో మాట్లాడుతూ దాన్ని చూపించారు. మొదటి కార్డును తానే కొన్నానని కూడా చెప్పారు. 

New Update
usa

Gold Card

గోల్డ్ కార్డు...ఇది కొనుక్కుంటే అమెరికా పౌరసత్వం ఇట్టే వచ్చేస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మధ్యనే దీన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు తాజాగా ఈ కార్డ్ ఎలా ఉంటుందో కూడా చూపించారు. తన ఫోటోతో ఉన్న గోల్డ్ కార్డ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. 5 మిలియన్ డాలర్లు ఉంటే దీనిని ఎవరైనా సొంతం చేసుకోవచ్చును. మొదటి కార్డును తానే కొన్నానని..రెండోది ఎవరు కొంటారో తెలియదని ట్రంప్ అన్నారు.  

5 మిలియన్లకు గోల్డ్ కార్డ్..

ఈ గోల్డ్ కార్డుల ద్వారా అమెరికాకు ఫైనాన్స్ ఉన్న లోటును పూరించవచ్చని ట్రంప్ అభిప్రాయపడుతున్నారు. సుమారు ఒక మిలియన్ గోల్డ్ కార్డులు ఇస్తామని తెలిపారు. దీంతో వచ్చిన మొత్తంతో అమెరికాలో ఉద్యోగాలు సృష్టించవచ్చని చెబుతున్నారు. విదేశీ పెట్టుబడిదారులను శాశ్వత నివాసితులుగా మార్చడానికి అనుమతించే "EB-5" వలస పెట్టుబడిదారు వీసా కార్యక్రమాన్ని "గోల్డ్ కార్డ్"తో భర్తీ చేస్తామని ట్రంప్ చెప్పారు. దీని ద్వారా ధనవంతులు తమ దేశంలోకి వస్తారని అన్నారు. అంతేకాదు అమెరికా వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను తొందరలోనే చెబుతామని  తెలిపారు.  ఇది రష్యన్లతో సహా అన్ని దేశాల వారికీ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. EB-5 ప్రోగ్రామ్‌ వల్ల జరుగుతున్న మోసాలు, ఇతర అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకొస్తున్నామన్నారు ట్రంప్. చట్టబద్ధంగా రావాలనుకున్న ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. 

 today-latest-news-in-telugu | usa | america president donald trump | american-citizenship

Also Read: IPL 2025: రెండు చేతులతో బౌలింగ్..ఏం టాలెంట్ రా భయ్

Advertisment
తాజా కథనాలు