/rtv/media/media_files/2025/04/25/ryuuT5tMspz39IdEXTkS.jpg)
Pahalgam Attack
Pahalgam Attack: పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం, అమెరికా ప్రభుత్వం తమ పౌరులు జమ్మూ కశ్మీర్‌కు ప్రయాణించొద్దని సూచించింది. కొత్తగా విడుదలైన ట్రావెల్ అడ్వైజరీలో మళ్లీ ఉగ్ర ముప్పు పొంచి ఉందని, పౌర అశాంతి, సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నందున ప్రయాణాలు ఆపుకోవాలని సూచించింది.
అప్రమత్తం అవసరం..
అమెరికా విదేశాంగ శాఖ వివరణ ప్రకారం, కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశముందని హెచ్చరించారు. శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గాం వంటి ప్రదేశాల్లో పరిస్థితి మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. నియంత్రణ రేఖకు సమీపంగా ప్రయాణించకూడదని, కనీసం 10 కిలోమీటర్ల పరిధిలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని అమెరికా తన పౌరులకు సూచించింది.
లద్దాఖ్‌కు ప్రయాణం ఓకే..
తూర్పు లద్దాఖ్ ప్రాంతం, ముఖ్యంగా లేహ్ నగరాన్ని మాత్రం సురక్షితంగా వెళ్లొచ్చని ట్రంప్ సర్కార్ పేర్కొంది. అక్కడి పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని, ప్రయాణం పరంగా పెద్దగా ఇబ్బందులు లేవని తెలిపింది.
Also Read: ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ
భారత్ కు ట్రంప్ సపోర్ట్..
ఇక పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. దాడి జరిగిన కొద్దిసేపటికే ట్రంప్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి, భారత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉగ్రవాదులను తేలికగా వదలకూడదని, న్యాయం జరగేలా చూస్తామని హామీ ఇచ్చారు.
Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం