/rtv/media/media_files/2025/10/21/visa-2025-10-21-10-51-47.jpg)
హెచ్-1బీ వీసా ఫీజుపై ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులకు భారీ ఊరట లభించింది. కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులపై లక్ష డాలర్ల (సుమారు ₹83 లక్షలు) భారీ ఫీజు విధించడంపై నెలకొన్న గందరగోళానికి అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) తాజాగా వివరణ ఇచ్చింది. ఈ భారీ రుసుము ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి మినహాయింపు ఉంటుందనే అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.
Also Read : K Ramp Collections: 'కె-ర్యాంప్' కలెక్షన్స్..! అప్పుడే బ్రేక్ ఇవెన్ అయిపోయిందా..?
Details on the H1-B $100k fee are now out. And as we feared, it’ll barely make a dent in the mass influx of workers from nations with populations 3x the size of the US.
— Mambo Murray (@highdefbrah) October 21, 2025
American colleges will continue their pay to stay scheme and Silicon Valley leader will rejoice at the… pic.twitter.com/iGV4MgmdnB
అమెరికా వెలుపల ఉన్నట్లయితే
2025 సెప్టెంబర్ 21న లేదా ఆ తర్వాత కొత్తగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి, వారు అమెరికా వెలుపల ఉన్నట్లయితే, ఈ ఫీజు వర్తిస్తుంది. అమెరికాలో చదువుకొని, ఉద్యోగాల కోసం హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసుకొనే విదేశీ విద్యార్థులు లక్ష డాలర్లు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. దీని ప్రకారం.. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు ముందుగా కొన్నేళ్లు అక్కడ చదవాల్సి ఉంటుంది. ప్రస్తుతం హెచ్-1బీ వీసా కలిగి ఉన్నవారు, విదేశాలకు వెళ్లి తిరిగి అమెరికాలోకి ప్రవేశించేటప్పుడు ఈ కొత్త ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
USCIS స్పష్టతతో, అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులకు (F-1 వీసా హోల్డర్లు), అలాగే ఇప్పటికే ఉద్యోగాలు చేస్తూ వీసా రెన్యూవల్ కోసం ఎదురుచూస్తున్న వారికి పెద్ద ఊరట లభించినట్లైంది.కొత్త నిబంధనల ప్రకారం, ఈ లక్ష డాలర్ల ఫీజును సాధారణంగా ఉద్యోగాన్ని స్పాన్సర్ చేసే కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే, యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ (DOL) నిబంధనల ప్రకారం, హెచ్-1బీ పిటిషన్ ప్రక్రియకు సంబంధించిన అన్ని ఖర్చులను యజమానియే భరించాలి.