అమెరికాలో ఇండియన్స్‌కు US ఎంబసీ స్ట్రాంగ్ వార్నింగ్

అమెరికాలో అక్రమంగా ఉంటున్న ఇండియన్స్‌కు యూఎస్ ఎంబసీ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా ఇమిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేస్తోదని మంగళవారం US ఎంబసీ తెలిపింది. ఇప్పటికే 205 మంది భారతీయులతో టెక్సాస్‌ సైనిక విమానం ఇండియాకు బయల్దేరిన విషయం తెలిసిందే.

New Update
us embussy

us embussy Photograph: (us embussy)

అమెరికాలో కొత్త గవర్నమెంట్ అక్రమవలసదారులపై కఠికంగా వ్యవహరిస్తోంది. అక్రమ వలసదారులను ఇండియాకు పంపిస్తున్న నేపథ్యంలో అక్కడి రాయబార కార్యాలయం అమెరికాలో ఉంటున్న ఇండియన్స్‌ను గట్టిగా హెచ్చరించింది. అమెరికా ఇమిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేస్తోదని యూఎస్ ఎంబసీ తెలిపింది. అమెరికాలో అక్రమ వలసదారులు నివసిస్తే ఏ మాత్రం సహించమని స్పష్టం చేసింది. 

వీసా గడువు ముగిసిన, అక్రమ వలసదారులుగా అక్కడే ఉంటున్న 205 మంది భారతీయులతో టెక్సాస్‌ యూఎస్ ఆర్మీ స్పెషల్ విమానం ఇండియాకు బయల్దేరింది. త్వరలోనే ఇంకాచాలామంది అక్రమ వలసదారులను ఇండియాకు పంపుతామని అమెరికా చెబుతోంది. అమెరికాలో అధికారికంగా ఇప్పటివరకూ 18 వేల మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు గుర్తించారు.

అనధికారికంగా ఆ సంఖ్య లక్షల్లో ఉంటుందని సమాచారం. ఇదెలా ఉండగా ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అక్రమవలసదారులపై ఉక్కుపాదం మోపుతుండగా.. వాటికి సంబంధించిన చర్చలు ఇరు దేశాల మధ్య ఏమైనా జరుగుతాయా అని ఆసక్తి నెలకొంది. ట్రంప్ రెండవ సారి ప్రెడిడెంట్ అయ్యాక మోదీ ఫస్ట్ టైం ఆయన్ని కలవనున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు