US Elections 2024: ట్రంప్ గెలుపు.. భారత్‌కు లాభమా? నష్టమా?

ట్రంప్ గెలుపుతో భారత్ కు నష్టమా లాభమా అన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు మాత్రం ఇది పెద్ద దెబ్బేనన్న చర్చ సాగుతోంది. అయితే.. మోదీతో ట్రంప్ స్నేహం మనకు కలిసి వస్తుందన్న అభిప్రాయం సైతం వ్యక్తం అవుతోంది.

New Update
Trump

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మరోసారి విజయం సాధించారు. దీంతో ట్రంప్ మద్దతుదారులు సంబురాలు చేసుకుంటున్నారు. మరోవైపు ట్రంప్ గెలవడంతో భారత మార్కెట్లకు ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? అనే చర్చ ఇప్పుడు విస్తృతంగా జరుగుతోంది. ట్రంప్ గెలుపొందడంతో భారత్‌-అమెరికా సంబంధాలపై ఎలా ప్రభావం చూపుతుందనే ప్రశ్నలు సైతం తల్లెత్తుతున్నాయి. 

అధిక సుంకాల ఆందోళన..

ట్రంప్ తన మొదటి టర్మ్‌లో అనేక దేశాలపై, ముఖ్యంగా చైనా, భారతదేశం దిగుమతులపై అధిక సుంకాలను విధించే విధానాన్ని అనుసరించారు. ఇప్పుడు ఆయనే మళ్లీ అధ్యక్షుడు కావడంతో ఈ సారి కూడా భారతీయ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించే అవకాశం ఉందన్న భయం నెలకొంది. 2022-23 సంవత్సరంలో, భారతదేశం అమెరికాకు $78.54 బిలియన్ల ఉత్పత్తులను ఎగుమతి చేసింది. అమెరికా నుంచి $50.24 బిలియన్లను దిగుమతి చేసుకుంది. దీంతో అమెరికాతో వాణిజ్యంలో భారత్ లాభదాయకంగా ఉందని స్పష్టమవుతోంది. భారత ఎగుమతులపై ట్రంప్ భారీగా సుంకం విధిస్తే.. అది భారతీయ ఉత్పత్తుల ధరను పెంచుతుంది.

రీప్లేస్‌మెంట్ ట్యాక్స్: రీప్లేస్‌మెంట్ ట్యాక్స్ విధిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. అంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అధిక సుంకాలు విధించే దేశాలపై అదనపు పన్నులు విధించనున్నారు. దీంతో భారతీయ ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ ఉత్పత్తి ప్రభావితం అవుతుంది.

Also Read : మరోసారి అగ్రరాజ్యాధినేతగా ట్రంప్‌ 2.o!

ఆ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గే అవకాశం..

దుస్తుల ధరలు: భారతీయ వస్త్రాలు, నగలు, తోలు ఉత్పత్తులు వంటి శ్రమతో కూడుకున్న వస్త్రాలకు డిమాండ్ తగ్గవచ్చు. అమెరికాకు భారతదేశం యొక్క వస్త్ర ఎగుమతులు సుమారు $16 బిలియన్లు. యుఎస్ మార్కెట్‌లో డిమాండ్ తగ్గితే, భారతీయ తయారీదారులు ఉత్పత్తిని తగ్గించవలసి ఉంటుంది. 

ఆహార ధరలు: అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల ఆహార ధరలు కూడా ప్రభావితం కావచ్చు. ట్రంప్ తీసుకుంటున్న చర్యల వల్ల అమెరికా మార్కెట్‌లో ఆహార పదార్థాలు ఖరీదుగా మారితే.. దాని ప్రభావం భారత మార్కెట్‌పైనా పడనుంది. టీ, కాఫీ, సుగంధ ద్రవ్యాలతో సహా ఆహార పదార్థాలను భారతదేశం ప్రధానంగా ఎగుమతి చేస్తుంది. అమెరికాలో ఆహార పదార్థాలు ఖరీదైతే, భారత్‌లో కూడా వాటి ధరలు పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఫార్మాస్యూటికల్స్ మరియు ఐటి సేవలు: భారతీయ ఫార్మాస్యూటికల్స్, ఐటీ సేవలు కూడా నష్టాలను చవిచూడవచ్చు. H-1B వీసా విధానాల్లో కఠిన వైఖరి ఈ పరిశ్రమలను ప్రభావితం చేయవచ్చు. దాదాపు 40 బిలియన్ డాలర్లు ఎగుమతి చేసే ఫార్మాస్యూటికల్స్ పరిశ్రమ ట్రంప్ విధానాల వల్ల ప్రభావితం కావచ్చు.

Also Read: ఎవరీ ట్రంప్..! ఏమిటి ఈయన కథ?

విద్యార్థులకు, ఐటీ నిపుణులకు దెబ్బ..

గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హెచ్‌1 బీ వీసాలపై కఠినంగా వ్యవహరించారు. ఆ విధానం భారతీయ నిపుణులపై ప్రభావం చూపిందన్న అభిప్రాయం ఉంది. ఇంకా మన దేశ IT నిపుణులు, సంస్థలకు అనేక సమస్యలను సృష్టించింది. ట్రంప్ విజయంతో భారత ఐటీ ఉద్యోగులపై ఆధారపడే అమెరికా సాంకేతిక సంస్థలకు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. విదేశీ వలసదారులపై ట్రంప్ కఠిన వైఖరి అవలంభిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో భారత విద్యార్థులకు, ఇక్కడి నుంచి ఉద్యోగాల నిమిత్తం వెళ్లే ఐటీ ఎంప్లాయీస్‌కు నష్టం తప్పదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

Also Read: US Elections 2024: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్

మోదీతో స్నేహం కలిసి వస్తుందా?

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ప్రధాని ప్రధాని మోదీతో ఆయన మంచి స్నేహాన్ని కొనసాగించారు. వారిద్దరు కలిసి హౌడీ మోదీ, నమస్తే ట్రంప్‌ తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు బలపడ్డాయన్న అభిప్రాయం ఉంది. అమెరికాకు భారత్‌ ప్రధాన వ్యూహాత్మక భాగస్వామిగా సైతం వ్యవహరిచింది. ఇప్పుడు ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన ఈ సమయంలో వలసలు, వాణిజ్యం, దౌత్యం, మిలటరీ సహకారం తదితర అంశాల్లో సత్సంబంధాలు మరింతగా బలపడుతాయన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. మనకు శత్రువు లాంటి చైనాను ట్రంప్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తారు. దీంతో ట్రంప్ గెలుపుతో చైనాపై పోరాటంలో భారత్‌కు అమెరికా మద్దతు లభించే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు