H-1B Visa: హెచ్ 1 బీ వీసా ఫీజుపై మరింత వేగంగా విచారణ

ఈ ఏడాది హెచ్ 1 బీ వీసా కార్యక్రమం మొదలవబోతోంది. కానీ కంపెనీలకు మాత్రం దీని ఫీజుపై ఇంకా క్లారిటీ రాలేదు. అందుకే హెచ్ 1 బీ వీసా ఫీజులపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేసిన అప్పీల్ పై విచారణను మరింత వేగవంతం చేయనున్నారు. 

author-image
By Manogna Alamuru
New Update
H-1B visa crackdown triggers US banks hiring boom in India

H-1B visa crackdown triggers US banks hiring boom in India

హెచ్ 1బీ వీసా ఫీజులను వెయ్యయ డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాన్ని ప్రకటించారు. దీని తర్వాత చాలా గందరగోళం నెలకొంది. దాదాపు అన్ని కంపెనీలు ఇంత ఫీజు పెంచితే కష్టం అంటూ గగ్గోలు పెట్టాయి. కానీ ట్రంప్ ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. వీసా ఫీజుల విషయంలో తగ్గేదే ల్యా అని చెప్పేసింది. ఉద్యోగాలు అన్నీ అమెరికన్లకే రావాలని తేల్చి చెప్పింది. దీంతో అమెరికాలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెచ్ 1బీ వీసా ఫీజులపై కోర్డులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేసిన దిగువ కోర్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాన్నే సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. దీనిని యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అప్పీల్ కోర్టులో సవాల్ చేసింది. 

ఊరటనివ్వండి ప్లీజ్..

అయితే హెచ్ 1బీ వీసా ఫీజుల అప్పీల్ పై విచారణను వేగవంతం చేయాలని తాజాగా ఛాంబర్‌  మరోసారి కోర్టును అభ్యర్థించింది. దీనిని న్యాయస్థానం అంగీకరించింది. ఈ ఏడాది హెచ్‌-1బీ వీసాల కార్యక్రమంలో కంపెనీలు పాల్గొనాలా.. వద్దా..? అనేది ఈ కోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉంటుందని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తన అప్పీల్ లో తెలిపింది.  కేసు విచారణ లేట్ అయితే హెచ్ 1బీ ఉద్యోగుల నియామకాలు కూడా ఆలస్యం అవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. మార్చిలోపు ఫీజు పెంపుపై తీర్పు చెప్పాలని..ఊరట కలిగించేలా తీర్పు ఇవ్వాలని ఛాంబర్ కోరింది. మరోవైపు విచారణ వేగవంతంగా జరపాలనే అభ్యర్థనను ట్రంప్‌ ప్రభుత్వం తరఫు న్యాయబృందం కూడా వ్యతిరేకించలేదు. దీంతో హెచ్ 1బీ వీసా ఫీజుల పెంపు అప్పీల్ పై ఫిబ్రవరిలో వాదనలు వింటామని కోర్టు తెలిపింది. 

హెచ్ 1బీ వీసా ఫీజులపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆందోళన వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ తీసుకొచ్చిన సంక్లిష్టమైన వీసా వ్యవస్థను ఇది దెబ్బతీస్తోందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆందోళన వ్యక్తం చేసింది. దీని వలన చాలా కంపెనీలు నష్టపోతున్నాయని...తక్కవు నైపుణ్యం కలవారిని నియమించుకోవాల్సి వస్తుందని చెబుతోంది. అంతేకాదు ఈ నిర్ణయం వలన హెచ్‌-1బీ ఉద్యోగులను బలవంతంగా తగ్గించుకొనే పరిస్థితి ఏర్పడింది. ఇది వారి పెట్టుబడిదారులతో పాటు కస్టమర్‌లు, సొంత ఉద్యోగులపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోందని వాదించింది. 

ఛాంబర్ ఆఫ్ కామర్స్..

అమెరికాలో ఉన్న మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, మెటా, వాల్ మార్ట్ వంటి దిగ్గజ సంస్థలతో సహా దేశంలోనే అత్యధిక కంపెనీల సభ్యత్వం కలిగిన వ్యాపార సంస్థల లాబీ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఇదిపోరాటంలోకి దిగితే ఎదురు నిలబడడం కాస్త కష్టమే.  ఇప్పటి వరకు టెక్ కంపెనీలు విడిగా ట్రంప్ హెచ్ 1బీ వీసా ఫీజు పెంపుపై వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. కానీ ఇప్పుడు వారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో కలిసి పోరాటానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.  ఒకవేళ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గనుక కేసు వేస్తే, ట్రంప్ తో వీరు కోర్టులో పోరాడటం ఇది రెండోసారి అవుతుంది.  ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను నిలిపివేశారు. అప్పుడు కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆయనపై ఫెడరల్ కోర్టు కేసు వేసి గెలిచింది.  ఫెడరల్ కోర్టు ట్రంప్ ఆదేశాలను రద్దు చేసింది.

Advertisment
తాజా కథనాలు