/rtv/media/media_files/2025/02/20/whqQurluWR3wqzszlt5V.jpg)
China Helicopter
తన పక్క దేశాల భూభాగాలను ఆక్రమించడానికి చైనా ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే ఫిలిప్పీన్స్ మీద కూడా చైనా ఎప్పుడూ కాలు దువ్వుతూ ఉంటుంది. రెండు దేశాలను కలుపుతూ ఉండే సముద్రంలో ఎప్పుడూ దాడులు చేస్తూ ఉంటుంది చైనా. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ బలగాలు..చాలాసార్లు ఫిలిప్పీన్స్ నేవీపై దాడులు చేశాయి. దక్షిణ, తూర్పు చైనా సముద్రాలు తనవేనని చైనా ఎప్పటినుంచో వాదిస్తోంది.
గాల్లో ఉద్రిక్తత..
తాజాగా ఫిలిప్పీన్స్ పై చైనా మరోసారి దాడికి దిగింది. అయితే ఈసారి సముద్రంలో కాకుండా ఆకాశంలో చేసింది . ఫిలిప్పీన్స్ విమానానికి అత్యంత దగ్గరగా తన దేశపు హెలికాఫ్టర్ తీసుకువచ్చి భయపెట్టడానికి చూసింది. రెండింటి దూరం కేవలం 10 అడుగులు మాత్రమే ఉండేంత దగ్గరగా వచ్చేసింది. దీంతో 30 నిమిషాలపాటు గాల్లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగింది. చైనా హెలికాప్టర్‌ను ఫిలిప్పీన్స్ విమాన పైలట్ హెచ్చరించారు. వారు చేస్తున్నది అత్యతం ప్రమాదకరమని చెప్పారు. తమ ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలకు ముప్పని హెచ్చరించారు. స్కార్‌బోర్గ్ షోలో ఈ ఘటన జరిగింది. ఇది ఫిలిప్పీన్స్ ఎక్స్‌క్లూజివ్ జోన్‌లో ఉంది. ఆ ప్రాంతం తమదేనని చైనా వాదిస్తోంది ఎప్పటిలాగే. దీన్ని 2012 నుంచి తమ ఆధీనంలోనే ఉంచుకుంది కూడా. ఇప్పుడు ఇలా హెలికాఫ్టర్ ద్వారా తమ ఆధిపత్యం చూపించుకోవడానికి బెదిరింపు చర్యలు చేసింది. ఈ ఘటనపై అగ్రారజ్యం అమెరికా రియాక్ట్ అయింది. దుందుడుకు చర్యలకు దూరంగా ఉండాలని చైనాకు హితవు పలికింది.
Also Read: USA: అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్