Trump Tariffs: సుంకాలతో 600 బిలియన్ డాలర్లు..టారీఫ్ లపై ట్రంప్ ప్రకటన

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాలతో దాడి చేశారు. దాదాపు అన్ని దేశాలపైనా టారిఫ్ లను విధించారు. దీని వల్ల తమకు లాభం చేకూరిందని..600 బిలియన్లకు పైగా ఆదాయం వచ్చిందని చెబుతున్నారు. 

New Update
Trump

Trump

ట్రంప్ టారిఫ్..చాలా దేశాలకు ఇదొక పీడకల. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారంలోకి రాగానే చేపట్టిన పనులలో ఈ సుంకాలు ఒకటి. ప్రపంచ దేశాలపై టారిఫ్ ల దండయాత్ర చేశారు ట్రంప్. కొన్ని దేశాల మీద అయితే 100, 200 శాతాలు కూడా విధించారు. భారత్ పై కూడా ఈ సుంకాలను అమలు చేశారు. రష్యా నుంచి చమురు కొంటూ ఉక్రెయిన్ తో యుద్ధానికి సహాయం చేస్తున్నామనే కారణంతో ఇండియాపై అదనపు సుంకాలతో విరుచుకుపడ్డారు. దీంతో రెండు దేశాల మధ్యనా వాణిజ్య సంబంధాలు కూడా క్షీణించాయి. వీటిపై దాదాపుగా ఆరు నెలలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. 

అమెరికా చాలా బావుంది..

తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ టారిఫ్ లపై కీలక ప్రకటన చేశారు. ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలతో అమెరికాకు బాగానే ముట్టిందని లెక్కలు చెప్పారు. ఈ సుంకాల కారణంగా అమెరికాకు 600 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చిందని...ఇంకా వస్తూనే ఉందని తెలిపారు. ఈ ఆదాయంతో దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ రెండూ చాలా బలంగా మారాయని ఆయన ప్రకటించారు. కానీ న్యూస్ మీడియా మాత్రం దీని గురించి మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళకు అమెరికా అంటే అక్కసు...వారికి మనపై గౌరవం లేదంటూ ట్రంప్ మండిపడ్డారు. ఈ మీడియా సంస్థలు రాబోయే సుప్రీంకోర్టు తీర్పును ప్రభావితం చేయాలని చూస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన తీర్పు అంటూ తన ట్రూత్ సోషల్ మీడియాలో రాశారు. ఎవరేమనుకున్నా టారిఫ్ ల వల్ల మాత్రం అమెరికా ఎప్పుడూ లేనంత బలంగా, గౌరవంగా ఉందని చెప్పారు. 

భారత్ పై మళ్ళీ సుంకాలు..

ఇదిలా ఉంటే రీసెంట్ గా భారత్ పై మరోసారి సుంకాలను విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. రష్యా(russia) చమురు విషయంలో భారత్‌(india) సహకరించకపోతే భారతీయ ఉత్పత్తులపై ఉన్న టారిఫ్‌(trump tariffs) లను ఇంకా పెంచుతామని వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుం 50 శాతం టారిఫ్ కొనసాగుతుండగా ఇది మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోదీకి కూడా ఈ విషయం తెలుసని చెప్పారు. ఆయన్ని మంచి వ్యక్తిగా అభివర్ణిస్తూనే నన్ను సంతోషపెట్టడం భారత్‌కు ముఖ్యమని చెప్పారు. రష్యాతో భారత్ వ్యాపారం కొనసాగిస్తే సుంకాలు వేగంగా పెంచుతామని హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌ను వైట్‌హౌస్‌ ఎక్స్‌లో షేర్ చేసింది. మరోవైపు రష్యా చమురు అంశంలో మాకు భారత్ సాయం చేయకుంటే టారిఫ్‌లు పెంచుతామని ట్రంప్‌ వ్యాఖ్యానించినట్లు రాయిటర్ తెలిపింది. 

Advertisment
తాజా కథనాలు