/rtv/media/media_files/2025/08/16/alaska-2025-08-16-02-39-54.jpg)
Trump-Putin Meet
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య అత్యున్నత స్థాయి చర్చలు మొదలయ్యాయి. ఇరువురు నేతలూ పలు అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ట్రంప్‌తో పాటు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్...పుతిన్‌తో పాటు భేటీలో పాల్గొన్న ఆ దేశ విదేశాంగ మంత్రి లావ్రోవ్, రష్యా విదేశాంగ విధాన సలహాదారు యుషకోవ్ లు భేటీలో పాల్గొన్నారు.
ట్రంప్ కు ఆహ్వానం పలికిన పుతిన్
సమావేశానికి ముందు పుతిన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అలస్కా విమానాశ్రయంలో ఆహ్వానం పలికారు. ఇద్దరు నేతలూ పరస్పర కరచాలనం చేసుకున్నారు. తర్వాత ఒకే కారులో భేటీ అయ్యే చోటు యాంకరేజ్ కు కలిసి వెళ్ళారు. అయితే సమావేశానికి ముందు అటు ట్రంప్, ఇటు పుతిన్ ఇద్దరూ పెద్దగా ఏమీ మాట్లాడలేదని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు శాంతి కోసమే సమావేశం అని చెప్పగా..పుతిన్ మాత్రం కాల్పుల విరమణకు సంబంధించిన ప్రశ్నలకు ఏమీ సమాధానం చెప్పకుండానే లోనికి వెళ్ళిపోయారు. మరోవైపు ఇరుదేశాధినేతలూ సమావేశమైన యాంకరేజ్ లో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బీ-2 స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్‌ల చక్కర్లు కొడుతున్నాయి.