US-China: చైనాతో ముదురుతున్న వాణిజ్య యుద్ధం..కుకింగ్ ఆయిల్ పై ఆంక్షలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాతో మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం రోజు రోజుకూ తీవ్రతరం అవుతోంది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు ఆంక్షలు విధించుకుంటూ వ్యాపారాన్ని మరింత కష్టతరం చేసుకుంటున్నాయి. తాజాగా చైనా కుకింగ్ ఆయిల్స్ పై అమెరికా ఆంక్షలు విధించింది. 

New Update
trump

అరుదైన ఖనిజాల విషయంలో చైనా పెట్టిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఆ దేశంపై వందశాతం సుంకాలను విధించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అంతకు ముందు అందరితో పాటూ 32 శాతం టారీఫ్ లు అమలు చేస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు వంద తోడై..మొత్తంగా చైనాపై 132శాతం టారిఫ్ లు అమల్లోకి వచ్చాయి. దీనిపై చైనా  మండిపడుతోంది. అమెరికా అవలంబిస్తున్న విధానాలు న్యాయంగా లేవని చైనా వాణిజ్య శాఖ ప్రకటన జారీ చేసింది. మేము తగువులు పెట్టుకోవాలని అనుకోము. కానీ మా మీదకు యుద్ధానికి వస్తే ఎక్కడా తగ్గము అని చెప్పింది. అందుకు తగ్గట్టుగానే అమెరికాపై ఆంక్షల వర్షం కురిపిస్తోంది. 

నౌకలపై ప్రత్యేక ఫీజులు..

తాజాగా  ఇరు దేశాల వాణిజ్య యుద్ధం సముద్రానికి పాకింది. వాణిజ్య నౌకలపై అమెరికా, చైనా దేశాలు ప్రత్యేక ఫీజులు ప్రకటించాయి. అమెరికా యాజమాన్యం లేదా ఆ దేశ జెండా ఉన్న షిప్ అయినా సరే తమ ఆధీనంలో ఉన్న సముద్రంలోకి వస్తే ప్రత్యేక ఫీజులు వసూలు చేస్తామంటూ చైనా ప్రకటించింది. దీనిలో కేవలం చైనా నిర్మించిన నౌకలకు మాత్రమే మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. దీనికి ప్రతిగా అమెరికా కూడా ఇవే ఫీజులను మొదలుపెట్టింది. ఈరోజు నుంచి అవి అమల్లోకి వస్తాయని చెప్పింది.

కుకింగ్ ఆయిల్ పై ఆంక్షలు..

వీటికి తోడు ఈ రోజు అమెరికా మరో కొత్త ఆంక్షలను ప్రకటించింది. అమెరికా సోయాబీన్లను కొనడానికి చైనా నిరాకరిస్తున్న కారణంగా తాము ఆ దేశ కుకింగ్ ఆయిల్ ను కొనము అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీనికి సంబంధించి తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వంట నూనెతో సంబంధం ఉన్న చైనా వ్యాపారాన్నింటినీ ముగించాలని అనుకుంటున్నామని చెప్పారు. అమెరికా సోయీబీన్లను చైనా ఉద్దేశపూర్వకంగా కొనుగోలు చేయడంల ఏదని ట్రంప్ ఆరోపించారు. దీని వలన అమెరికాలోని సోయాబీన్ రైతులకు ఇబ్బంది కలుగుతోందని చెప్పారు. అందుకనే ఈ చర్యలను తీసుకున్నామని ట్రంప్ వివరించారు. వంట నూనెను అమెరికానే సొంతంగా ఉత్పత్తి చేసుకోగలదు. దానిని చైనా నుంచి తెచ్చుకోవలసిన అవసరం లేదని చెప్పారు. యూఎస్ నుంచి సోయాబీన్ ను కొనుగోలు చేసే దేశాల్లో చైనా మొట్టమొదటిది. ఇదే అతి పెద్ద కొనుగోలుదారు కూడా. 2024లో దాదాపు $12.8 బిలియన్ల విలువైన 27 మిలియన్ మెట్రిక్ టన్నులను దిగుమతి చేసుకుంది. అయితే ఈ ఏడాది మే నుంచి చైనా మొత్తంగా సోయాబీన్ లను కొనుగోలు చేయడం మానేసింది.  

Advertisment
తాజా కథనాలు