/rtv/media/media_files/2025/01/20/SqaSIt3NEAUGSHndvPiU.jpg)
45521313212 Photograph: (45521313212)
Donald Trump: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యాక్షుడిగా జేడీ వ్యాన్స్ ప్రమాణస్వీకారం చేశారు. పాలనా బాధ్యతలు స్వీకరించాక ట్రంప్ తన విజయం గురించి మాట్లాడారు. అమెరికాను ఫస్ట్‌లో ఉంచడంమే తన లక్ష్యమని ఆయన చెప్పారు. అమెరికాకు స్వర్ణయుగం ఇప్పటి నుంచే మొదలైందని ట్రంప్ చెప్పారు. దేశంలో రాజకీయ కక్ష్యసాధింపులకు మా ప్రభుత్వంలో స్థానం ఉండదని ట్రంప్ హామీ ఇచ్చారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు అమెరికా ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు ట్రంప్.
విద్యా, వైద్యం రంగాల్లో సౌకర్యాలు ఇంకా మెరుగుపడాల్సి అవసరం ఉందని అమెరికా నూతన అధ్యక్షుడు అన్నారు. అమెరికా ప్రజలకు నేడు స్వాతంత్ర దినంలాంటిదని ఆయన అభివర్ణించారు. 2025 అమెరికన్లకు ఫ్రీడమ్ ఈయర్ అని, అమెరికా ప్రజలకు అత్యుత్తమ సేమలు అందించేందుకు కృషి చేస్తా అని ఆయన అన్నారు. పర్యావరణ పరిరక్షణ, విద్యా రంగంలో అనే మార్పులు తీసుకొస్తామని ట్రంప్ చెప్పారు. ఆదివారం గాజాలో బందీలు విడుదల కావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్స్ ఆఫ్ అమెరికా మార్చుతామని ఈ సందర్భంగా ట్రంప్ చెప్పారు. శాంతి భద్రతల విషయంలో మరింత కఠినంగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు అన్నారు. న్యాయ వ్యవస్థ నిస్పక్షపాతంగా పని చేసేలా చూస్తామని చెప్పారు. అసాధ్యాలను అమెరికా సుసాధ్యం చేస్తుందని మన పూర్వీకులు నిరూపించారు.
ఇది కూడా చదవండి : అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్
గతంలో దేశాన్ని తుపాన్లు అతలాకుతలం చేశాయని.. అమెరికా అనేక అటుపోట్లను తట్టుకొని నిలబడిందని ట్రంప్ అన్నారు. అత్యధిక చమురు నిల్వలు అమెరికా ఉత్పత్తి చేస్తోందని ట్రంప్ గుర్తు చేశారు. ఎలట్రానిక్ కార్లను అధిక సంఖ్యలో ఉత్పత్తి చేస్తామని ఆయన చెప్పుకొన్నారు. దేశంలో వివిధ రంగాల్లో ప్రతిభావంతులను ప్రోత్సహిండంలో వివక్ష ఉండదని అన్నారు.