America: వైట్‌ హౌస్‌ క్రిప్టో జార్‌ గా పేపాల్‌ మాఫియా సభ్యుడు!

ట్రంప్‌ కార్యవర్గంలో కృత్రిమ,మేధ, క్రిప్టో కరెన్సీలకు జార్‌ పదవిని సరికొత్తగా సృష్టించారు. ఈ పదవికి పేపాల్‌ మాజీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ డేవిడ్‌ శాక్స్‌ ను ట్రంప్‌ నియమించారు.

New Update
sacson

America: ఓ పక్క బిట్‌ కాయిన్‌ విలువ లక్ష డాలర్లు దాటగా..మరోవైపు  కృత్రిమ,మేధ, క్రిప్టో కరెన్సీలకు జార్‌ గా పేపాల్‌ మాజీ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ డేవిడ్‌ శాక్స్‌ ను ట్రంప్‌ నియమించారు.ట్రంప్‌ కార్యవర్గంలో ఈ పదవిని సరికొత్తగా సృష్టించారు. ఏఐ,క్రిప్టో అంశాలపై ఆయన దేశాధ్యక్షుడికి సలహాలు ఇస్తారని ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ట్రూత్‌ లో పేర్కొన్నారు.

Also Read: RBI : వడ్డీ రేట్లు యథాతథమే..ఎలాంటి మార్పులు లేవు:ఆర్బీఐ గవర్నర్‌!

అమెరికా భవిష్యత్తుకు సంబంధించి ఈ రెండు అంశాలు అత్యంత కీలకమైనవని తెలిపారు. పెద్ద టెక్‌ కంపనీలు పక్షపాత ధోరణులను కట్టడి చేసి వారి వాక్‌ స్వేచ్ఛను కాపాడతారని పేర్కొన్నారు. దీంతో పాటు అధ్యక్షుడి సైన్స్‌ అండ్‌ టెక్‌ కౌన్సిల్‌ ను కూడా డేవిడ్‌ నడిపిస్తారనిట్రంప్‌ తెలిపారు.

డేవిడ్‌ శాక్స్‌ నూతన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కు అత్యంత బలమైన మద్దతుదారు. తన పాడ్‌ కాస్ట్‌ లకు కూడా వాన్స్‌ ఆహ్వానించాడు. 

Also Read: IND-PAK: సముద్రంలో నౌక మునక.. పాక్ సాయంతో..!

డేవిడ్‌ వందల కోట్ల డాలర్లకు అధిపతి. అతడు ఫార్య్చూన్‌ పత్రిక ప్రచురించిన ప్రముఖ పేపాల్‌ మాఫియా ఫొటోలో సభ్యుడు. సాధారణంగా చెల్లింపులో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన  పేపాల్‌ సంస్థలో వ్యవస్థాపకులు,అందులో మొదటి నుంచి పనిచేసిన కీలక ఉద్యోగులను పేపాల్‌ మాఫియాగా వ్యవహరిస్తారు.

Also Read: Ram Mohan Naidu: సుధామూర్తి అమ్మ ప్రేమ..ముగ్ధుడైన ఏపీ మంత్రి!

ఈ బృందంలోని వారు తర్వాత పలు టెక్‌ కంపెనీలను ఆరంభించి సిలికాన్‌ వ్యాలీ ముఖ చిత్రాన్నే మార్చేశారు. అమెరికాలోని శక్తిమంతమైన వ్యక్తుల్లో వీరు ఒకరు.2002 లో ఈబే సంస్థ పేపాల్‌ ను కొనుగోలు చేశాక..డేవిడ్‌ మరిన్ని టెక్‌ కంపెనీలను  ఏర్పాటు చేశారు.  దీనిలో  యమ్మర్‌ కూడా ఒకటి.

దీనిని ఆ తర్వాత మైక్రోసాఫ్ట్‌ కొనుగోలు చేసింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ అధిపతి ఎలాన్‌ మస్క్‌ తో శాక్స్‌ కు మంచి స్నేహబంధం ఉంది. గురువారం మస్క్‌ కీలక చట్టసభ సభ్యులతో భేటీ అయ్యారు. ప్రభుత్వ వృథా వ్యయాలను కట్టడి చేయడం పై ఆయన వారితో చర్చలు జరిపారు.

Also Read: Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు మరో 28 స్పెషల్ ట్రైన్లు

అమెరికా ప్రభుత్వం చేస్తున్న 2 ట్రిలియన్‌ డాలర్ల అనవసర ఖర్చును తాను తగ్గిస్తానని ట్రంప్‌ ఎన్నికల్లో వాగ్ధానం చేశారు.ఈ  బాధ్యతలను ఎన్నికల అనంతరం మస్క్‌,వివేక్‌ రామస్వామిలకు అప్పగించిన విషయం తెలిసిందే. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు