Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. హార్వర్డ్ యూనివర్సిటీకి షాక్..

హార్వర్డ్‌ యూనివర్సిటీపై ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ యూనివర్సిటీకి సంబంధించి $2.2 బిలియన్ గ్రాంట్లు, $60 మిలియన్ కాంట్రాక్టులను (రూ. 19,000 కోట్ల గ్రాంట్లు, కాంట్రాక్టులు) నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

New Update
Trump and harvard university

Trump and harvard university

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఇటీవల ట్రంప్‌ విధించిన టారిఫ్‌ల వల్ల ప్రపంచ దేశాలే ఉలిక్కిపడ్డాయి. అయితే తాజాగా ట్రంప్‌.. హార్వర్డ్‌ యూనివర్సిటీపై కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ యూనివర్సిటీకి సంబంధించి $2.2 బిలియన్ గ్రాంట్లు, $60 మిలియన్ కాంట్రాక్టులను (రూ. 19,000 కోట్ల గ్రాంట్లు, కాంట్రాక్టులు) నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. 

Also Read: మైనర్ బాలికకు గర్భం.. పోక్సో కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు!

యూనివర్సిటీలో క్యాంపస్ యాక్టివిజం నియంత్రణ, మెరిట్-బేస్డ్ అడ్మిషన్స్, డైవర్సిటీ వీక్షణల ఆడిట్ చేయాలని ఇటీవల ట్రంప్ డిమాండ్ చేశారు. కానీ ఇందుకు హార్వర్డ్‌ యూనివర్సిటీ తిరస్కరించింది. దీంతో ఆ యూనివర్సిటికీ సంబంధించి.. $2.2 బిలియన్ గ్రాంట్లు, $60 మిలియన్ కాంట్రాక్టులను (రూ. 19,000 కోట్ల గ్రాంట్లు, కాంట్రాక్టులు) నిలిపివేస్తున్నామని చెప్పింది. దీంతో వర్సిటీ ఫ్యాకల్టీ, అమెరికన్ అసోసియేషన్‌ ఆఫ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్స్‌ ఈ నిలివేతనలను సవాలు చేస్తూ బోస్టన్ ఫెడర్ కోర్టులో దావా వేశారు. 

Also Read: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !

ఇదిలాఉండగా అమెరికా.. చైనా వస్తువులపై 145 శాతం సుంకం విధించిన సంగతి తెలిసిందే. చైనా కూడా అమెరికా వస్తువులపై 125 శాతం సుంకం విధించింది. దీంతో రెండు అతిపెద్ద ఆర్థిక ఆర్థిక వ్యవస్థల మధ్య ముదిరిన ట్రేడ్‌ వార్‌ ఇంకా ఎక్కడివరకు వెళ్తుందోనన్న ఆందోళన కలుగుతోంది. అయితే టారిఫ్ యుద్ధంలో తాజాగా బిగ్‌ట్విస్ట్‌ చోటుచేసుకుంది. సుంకాలపై ఇరుదేశాలు ఒప్పందానికి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. చైనా, అమెరికా ఆర్థిక వ్యవస్థలు విడిపోయేందుకు కారణాలు కనిపించడం లేదని యూఎస్‌ ట్రెజరీ చీఫ్‌ స్కాట్‌ బెసెంట్ అన్నారు. చైనాతో పెద్ద ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉందని వెల్లడించారు.

Also read: అయ్యప్ప భక్తులకు అదిరిపోయే శుభవార్త.. ఆన్‌లైన్‌లో బంగారు లాకెట్లు.. ఇలా బుక్ చేసుకోండి!

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు