Kenya: కెన్యాలో కూలిన విమానం..11 మంది మృతి

కెన్యాలో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ తీవ్ర విషాదానికి దారి తీసింది. ఈ  ప్రమాదంలో ఎనిమిది మంది హంగేరియన్లు, ఇద్దరు జర్మన్ ప్రయాణికులు, ఒక కెన్యా పైలట్ సహా 11 మంది మరణించారు.

New Update
kenya

కెన్యా తీర ప్రాంతం నుంచి బయలుదేరిన చిన్న విమానం కూలిపోయింది. అందులో ఉన్న 11 మంది మరణించారని ఎయిర్ లైన్స్ ధృవీకరించింది. ఈ ఫ్లైట్ డయాని నుంచి బయలుదేరి మసాయి మారాకు వెళుతోంది. మసాయి మారా అనేది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. అక్కడ నేషనల్ సఫారీ పార్క్ ఉంటుంది. దీనికి వెళుతున్న పర్యాటకుల విమానమే ప్రమాదానికి గురైంది. స్థానిక సమయం ప్రకారం ఉదయం 5:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. విమానం కూలిపోయి కిందపడ్డాక పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఈ కారణంగా ప్యాసెంజర్లు ఎవరూ బతికే అవకాశం లేదని తెలుస్తోంది. 

 మొత్తం 11 మంది మృతి..

మృతుల్లో కెన్యా పైలట్‌తో పాటు 10 మంది ప్రయాణికులు, ఎనిమిది మంది హంగేరీ, ఇద్దరు జర్మనీకి చెందినవారని మొంబాసా ఎయిర్ సఫారీ చైర్మన్ జాన్ క్లీవ్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అంతకు ముందు ఆగస్టులో, వైద్య స్వచ్ఛంద సంస్థ అమ్రేఫ్‌కు చెందిన తేలికపాటి విమానం రాజధాని నైరోబి శివార్లలో కూలిపోయి ఆరుగురు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు.

Advertisment
తాజా కథనాలు