USA: జెలెన్ స్కీ, ట్రంప్ భేటీ..తోమహక్ క్షిపణుల నిరాకరణ

యుద్ధం ఆపకపోతే తోమహాక్ క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇస్తానని రష్యాను బెదిరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్..అవి అడగడానికి వచ్చిన జెలెన్‌స్కీని మాత్రం ఉత్త చేతులతోనే సాగనంపారు. తనకు యుద్ధం ముగియడమే ముఖ్యమని ట్రంప్ చెప్పారు. 

New Update
trump-zelensky

ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపకపోతే తమ దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమై తోమహాక్ క్షిపణులను ఆ దేశానికి ఇవ్వాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మధ్యన రష్యాను బెదిరించారు. రష్యా చేత ఎలా అయినా యుద్ధం ఆపించాలని ట్రంప్ పట్టుపట్టుకుని కూర్చుకున్నారు. దాని కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ బెదిరింపులకు కూడా లొంగపోయేసరికి ఇప్పుడు ఆయనతో మరోసారి సమావేశానికి కూడా సిద్ధమయ్యారు. హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో మరి కొన్ని రోజుల్లో పుతిన్, జెలెన్‌స్కీలతో సమావేశమవనున్నారు ట్రంప్.

క్షిపణులు ఇవ్వను..యుద్ధం ముగించడమే ముఖ్యం..

అయితే అంతకు ముందే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈరోజు అమెరికాకు వచ్చారు ఓవల్ ఆఫీసలో అధ్యక్షుడు ట్రంప్‌ను కలిశారు. తోమహాక్ క్షిపణులను ఇవ్వాలని అందుకు బదులుగా తాము డ్రోన్లను ఇస్తామని చెప్పారు. కానీ ట్రంప్ మాత్రం ఉక్రెయిన్ అధ్యక్షుడికి మొడిచెయ్యి చూపించారు. తోహమమాక్ క్షిపణులను ఇప్పుడు ఇవ్వలేనని చెప్పేశారు. అమెరికా నిల్వలను తగ్గించలేనని..వాటిని సరి చూసుకోవాలని చెప్పారు. దాని కన్నా ముఖ్యంగా తనకు యుద్ధం ముగించడమే అత్యంత ముఖ్యమని తెలిపారు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు తాను క్షిపణులను ఇవ్వలేనని జెలెన్‌స్కీ కు చెప్పేశారు ట్రంప్. అయితే తోమహాక్ క్షిపణులు తమ దగ్గర ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ శాంతి చర్చలను సీరియస్‌గా తీసుకునేలా చేయొచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడు అంటున్నారు. ముందు బుడాపెస్ట్‌లో సమావేశం అవ్వనివ్వాలని..తర్వాత క్షిపణుల గురించి ఆలోచిస్తానని ట్రంప్ దానికి బదులు చెప్పారని వైట్ హౌస్ అధికారులు చెబుతున్నారు. అయితే ట్రంప్ తోమహాక్ క్షిపణుల నిరాకరణ వెనుక రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరిక ఉందని తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు క్షిపణులను ఇస్తే అమెరికా-రష్యా సంబంధాలకు హాని కలుగుతుందని, దాని వలన యుద్ధం మరింత సీరియస్ అవుతుందే తప్ప ఏం ఉపయోగం లేదని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. 

దీంతో పాటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ...ట్రంప్‌తో మరికొన్ని ఒప్పందాలను చేసుకున్నారు. అమెరికన్ ధ్రువీృత సహజవాయువును నిల్వ చేయడం వంటి సంభావ్య ఇంధన ఒప్పందాలపై చర్చించారు. దీని ద్వారా యూరప్‌లో అమెరికా వ్యాపారం మరింత విస్తరిస్తుందని తెలిపారు. ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడంలో సహాయపడుతుందన్నారు.

Also Read: BIG BREAKING: హద్దులు మీరుతున్న పాకిస్తాన్...ఆఫ్ఘాన్ బోర్డర్‌పై దాడి..ముగ్గురు క్రికెటర్లతో సహా 8మంది మృతి

Advertisment
తాజా కథనాలు