BREAKING: న్యూయార్క్‌లో పెద్ద ఎత్తున సామూహిక కాల్పులు

అమెరికాలోని న్యూయార్క్ నగరంలో బ్రూక్లిన్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్‌లో ఆదివారం కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన వాతావరణం నెలకొంది.

New Update
mass shooting

అమెరికాలో తుపాకుల శబ్దం మరోసారి కలకలం రేపింది. న్యూయార్క్ సిటీ బ్రూక్లిన్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో ఆదివారం కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా భయాందోళన వాతావరణం నెలకొంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు ఉదయం 3:30 గంటల సమయంలో క్రౌన్ హైట్స్‌లోని ఫ్రాంక్లిన్ అవెన్యూలో ఉన్న "టేస్ట్ ఆఫ్ సిటీ లాంజ్" అనే రెస్టారెంట్‌లో ఈ దారుణం జరిగింది. రెస్టారెంట్ మూసివేసే సమయంలో దుండగులు లోపలికి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల శబ్దం విని భయపడిన అక్కడి ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీశారు.

ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (NYPD) సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఈ కాల్పుల్లో మృతి చెందిన వారిలో ఇద్దరు పురుషుల వయసు 27, 35 సంవత్సరాలుగా పోలీసులు గుర్తించారు. మూడవ వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. గాయపడిన వారిలో ఎనిమిది మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని, వారి వయసు 27 నుంచి 61 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.

పోలీసుల దర్యాప్తులో భాగంగా, ఘటనా స్థలం నుంచి 36కు పైగా బుల్లెట్ కేసింగ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇది బహుళ తుపాకులను ఉపయోగించినట్లు సూచిస్తోంది. ఈ దాడిలో ఒకరి కంటే ఎక్కువ మంది దుండగులు పాల్గొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ దారుణ ఘటనపై న్యూయార్క్ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు