/rtv/media/media_files/2025/03/15/Iz91LoFTT4EBUKYdRJ7m.jpg)
Tesla Seeks Certification For Model Y And Model 3 To Enter Indian Market
Trump vs Elon Musk: ఒక వారం క్రితం వరకూ అత్యంత సన్నిహితులు. అమెరికా ఫస్ట్ అంటూ కలిసి పని చేశారు. అధ్యక్ష ఎన్నికల ముందు నుంచీ కలిసి ప్రణాళికలు వేశారు. కానీ ఇప్పుడు బద్ధ శ్రతువుగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు(One Big Beautiful Bill) వలన వచ్చింది. ఈ బిల్లు విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, టెక్ అధిపతి ఎలాన్ మస్క్ మధ్య భేదాభిప్రయాలు వచ్చాయి. ఇద్దరూ బహిరంగంగానే విమర్శించుకుంటున్నారు.
RTV News App: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండి..
— RTV (@RTVnewsnetwork) June 4, 2025
RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్చేసుకోండి. ఈ కింది లింక్స్ పై క్లిక్ చేసి నేరుగా మీ… pic.twitter.com/ImFUCn2AfR
RTV News App Download Links:
ఆండ్రాయిడ్(Android) వినియోగదారులు: https://t.co/B1FaPB6Zsr
IOS వినియోగదారులు: https://t.co/4nRQaLbtfv
ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ పరిణామాలు ఎలాన్ మస్క్ టెస్లాపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ కంపెనీ షేర్లు దారుణంగా పతనమయ్యాయి(Tesla Shares Fall). దీంతో మస్క్ సంపద 152 బిలియన్ డాలర్లు అంటే దాడాపు రూ. 13 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో టెస్లా షేర్లు ఏకంగా 14శాతం తగ్గిపోయాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 1 ట్రిలియన్ నుంచి 916 బిలియన్ డాలర్లకు పడిపోయింది. టెస్లా సంపద ఒక్క రోజులోనే ఇంతలా తగ్గిపోవడం ఇదే మొదటిసారి.
Also Read: అమృత్‌సర్ స్వర్ణ దేవాలయంలో ఖలిస్థానీలు.. నినాదాలతో కలకలం
టెస్లా గురించి వ్యతిరేకంగా పోస్ట్..
ఎక్స్‌లో ట్రంప్‌పై వరుస ట్వీట్లతో మస్క్ విరుచుకుపడుతున్నారు(Trump vs Elon Musk Tweets War). తాజాగా ఓ యూజర్ ట్రంప్‌ను అభిశంసించి.. ఆయన స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా చేయాలని పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన ఎలాన్ మస్క్.. ఆ పోస్టును సమర్థించాడు. ఈ పోస్టును గుర్తుపెట్టుకోవాలని.. భవిష్యత్తులో ఇదే జరుగుతుందని రాసుకొచ్చారు. ఓ పెద్ద బాంబు లాంటి సమాచారాన్ని చెప్పే సమయం వచ్చింది. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరు ఉంది. అందుకే ఆ ఫైల్స్ వివరాలు బయటపెట్టడం లేదని మస్క్ పోస్ట్ చేశాడు. దీనిపై ట్రంప్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మస్క్ వ్యాపారాలకు ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తానని హెచ్చరించారు. అమెరికాలో ప్రతిఒక్కరూ బలవంతంగా విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేలా మస్క్ ఒత్తిడి చేయాలనుకుంటున్నారు. దానికి నేను అంగీకరించలేదు. వెళ్లిపొమ్మని చెప్పా. అందుకే ఆయన ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.