అమెరికాలో అక్రమంగా ఉంటున్న ఎలాన్ మస్క్.. త్వరలో బహిష్కరణ ? ఎలాన్ మస్క్ అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారని కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. ఇవి నిజమని తేలితే ఆయనకు బహిష్కరణ ముప్పు ఉండే ఛాన్స్ ఉందని నిపుణలు చెబుతున్నారు. మరోవైపు నన్ను అణిచివేసేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మస్క్ స్పందించారు. By B Aravind 02 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గత కొన్నిరోజులుగా ఈ ఎన్నికల్లో యాక్టివ్‌గా వ్యవహరిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్‌నకు మద్దతిస్తూ ప్రచారం చేస్తున్నారు. ట్రంప్‌ను గెలిపించాలంటూ ఎక్స్ లో కూడా నెటిజన్లకు సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎలాన్ మస్క్‌కు సంబంధించి ఓ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారని కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. Also Read: 398 భారతీయ సంస్థలపై అమెరికా ఆంక్షలు.. రష్యాతో దోస్తీయే కారణమా!? బహిష్కరణకు ముప్పు ఒకవేళ మస్క్ అక్రమంగా ఉంటున్నట్లు నిజమని తేలితే.. ఆయనకు బహిష్కరణ ముప్పు ఉండొచ్చనే వార్తలు రావడం చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై ఎలాన్ మస్క్ స్పందించారు. ఇవన్నీ కూడా తనను అణచివేసేందుకు రాజకీయంగా ప్రేరేపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఘూటుగా స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై కూడా నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. 1990లో ఎలాన్ మస్క్.. తన ఉద్యోగ జీవిత ప్రారంభ దశలో అమెరికాలో అక్రమంగా నివాసం ఉన్నారని వార్తలు వచ్చాయి. ఒకవేళ ఆ వార్తలు నిజమని తేలితే మస్క్ బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది లేదా ఆయన అమెరికా పౌరసత్వం రద్దయ్యే ఛాన్స్ ఉందని న్యాయ నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. Also Read: కోలుకోలేని దెబ్బ కొడతాం.. అమెరికా, ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్ వాస్తవానికి ఎలాన్ మస్క్ దక్షిణాఫ్రికాలో జన్మించారు. ఆ తర్వాత ఆయన తల్లి ద్వారా మస్క్‌కు కెనడా పౌరసత్వం వచ్చింది. ఇప్పుడు ఆయన అమెరికా పౌరుడిగా ఉన్నారు. అయితే ఆయన అక్రమంగా ఉంటున్నారని వార్తలు రావడంతో మస్క్ స్పందించారు. నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిస్తే.. నన్ను అణిచివేసేందుకు చేయాల్సిందంతా చేస్తారని అన్నారు. నేను అదే విషయం చెబుతుంటే ఆ మాటలు ఇంకా చాలామంది నమ్మడం లేదని పేర్కొన్నారు. #elon-musk #telugu-news #usa-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి