London: బ్రిటన్‌లో రెచ్చిపోయిన దుండగులు.. రైలులో  కత్తులతో వీరంగం

లండన్‌కు వెళ్తున్న రైలులో చోటుచేసుకున్న సామూహిక కత్తిపోటు దాడులు యునైటెడ్ కింగ్‌డమ్‌ను ఉలిక్కిపడేలా చేశాయి. ఈ దాడిలో మొత్తం 10 మంది ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది.బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌షైర్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

New Update
FotoJet - 2025-11-03T065806.453

Terrorists in Britain rampage with knives on a train

London: లండన్‌కు వెళ్తున్న రైలులో చోటుచేసుకున్న సామూహిక కత్తిపోటు దాడులు యునైటెడ్ కింగ్‌డమ్‌ను ఉలిక్కి పడేలా చేశాయి. ఈ  దాడిలో మొత్తం 10 మంది ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌షైర్‌లో శనివారం అర్ధరాత్రి ఈ  దారుణ ఘటన చోటుచేసుకుంది. లండన్‌ లోని డాన్‌కస్టర్‌ నుంచి కింగ్స్‌ క్రాస్‌కు వెళ్తున్న రైలులో దుండగులు కత్తులతో వీరంగం సృష్టించారు. 10 మందిని విచక్షణా రహితంగా పొడిచారు. కత్తిపోట్ల ఘటనతో రైలు కంపార్ట్‌మెంట్లలో ప్రయాణీకులు పెద్ద ఎత్తున ఆర్తనాదాలు, అరుపులతో నిండిపోయింది. ఈ విషయాన్ని గమనించిన ఒక ప్రయాణికుడు పోలీసులకు సమాచారం అందించాడు. అత్యవసర అలారాన్ని మోగించాడు.  అలారం మోగిన వెంటనే, కేంబ్రిడ్జ్‌షైర్‌లోని హంటింగ్‌డన్ రైల్వే స్టేషన్‌ను సాయుధ పోలీసులు, పోలీసు కార్లు అంబులెన్స్‌లు చుట్టుముట్టాయి.

 దీంతో తక్షణమే స్పందించిన కేంబ్రిడ్జ్‌షైర్‌ పోలీసులు హంటింగ్‌డన్‌ స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. బాధితుల్లో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తొలుత కేంబ్రిడ్జ్‌షైర్‌ పోలీసులు ప్రకటించారు. అయితే చికిత్స అనంతరం వీరిలో నలుగురు ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారని తెలిపారు. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని వెల్లడించారు. అదే సమయంలో దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ స్వదేశీయులేనని తెలుస్తోంది. కౌంటర్‌ టెర్రరిజం పోలీస్‌ విభాగం కూడా దర్యాప్తులో భాగమైనట్లు బ్రిటిష్‌ ట్రాన్స్‌పోర్ట్‌ పోలీస్‌(బీటీపీ) తెలిపింది. రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, రహదారిని అన్ని వైపులా మూసివేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో రైలు సర్వీసులు నిలిపివేశారు. ఈ భయంకరమైన ఘటనపై బ్రిటన్‌ ప్రధానమంత్రి కీర్‌ స్టార్మర్, హోం సెక్రటరీ షబానా మహమూద్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు అంతర్గత మంత్రి షబానా మహమూద్ ధృవీకరించారు.

 కాగా ఈ విషయమై రైలులో ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఈ ఘటన గురించి వివరిస్తూ  ఒక పొడవైన కత్తిని పట్టుకున్న వ్యక్తిని చూసినట్లు ఒకరు ‘టైమ్స్’ వార్తాపత్రికకు తెలిపారు.  ఆ సమయంలో అంతటా రక్తం కనిపించిందని, ప్రయాణికులు  భయంతో వాష్‌రూమ్‌లలో దాక్కున్నారని వివరించారు. మరొకరు ‘స్కై న్యూస్‌’తో మాట్లాడుతూ, రైలు ఆగిన తర్వాత ప్లాట్‌ఫారమ్‌పై ఒక వ్యక్తి పెద్ద కత్తిని పట్టుకుని ఉన్నాడని, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం చూశామని చెప్పారు.


కాగా ఈ విషయమై యూకే ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ స్పందించారు. ఈ ఘటనను భయంకరమైనది. ఆందోళన కరమైనదిగా పేర్కొన్నారు. బాధితుల చుట్టూ తన ఆలోచనలు తిరుగుతున్నాయని, అయితే  వెంటనే ప్రతిస్పందించిన అత్యవసర సేవా విభాగాలకు  ధన్యవాదాలు అని ఆయన ‘ఎక్స్‌’లో ఒక  పోస్టు చేశారు. కాగా ఈ ఘటన మరోసారి యునైటెడ్ కింగ్‌డమ్‌లో పెరుగుతున్న కత్తి దాడుల ప్రమాదాలను ఎత్తిచూపింది. అధికారిక డేటా ప్రకారం ఇంగ్లాండ్, వేల్స్‌లో 2011 నుండి ఈ తరహా దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రధాని కీర్ స్టార్మర్ గతంలో ఇటువంటి దాడులను జాతీయ సంక్షోభంగా అభివర్ణించిన విషయం తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు