Earthquake: పెను విషాదం.. 2700కు పెరిగిన భూకంప మృతులు

మయన్మార్‌లో సంభవించిన భూకంపం పెను విషాదం సృష్టించింది. దీనివల్ల ఇప్పటిదాకా 2,719 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాళ్లలో 5 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులు 50 మంది ఉన్నట్లు తెలిపాయి.

New Update
Earthquake in Myanmar

Earthquake in Myanmar

మయన్మార్‌లో  సంభవించిన భూకంపం పెను విషాదం సృష్టించింది. ఈ భూప్రళయం ధాటికి మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ ప్రమాదం వల్ల ఇప్పటివరకు కలిపి 2,719 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాళ్లలో 5 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులు 50 ఉన్నట్లు తెలిపాయి.  మరో 4,521 మంది గాయపడ్డారని.. 441 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని పేర్కొన్నాయి. ప్రస్తుతం సైనిక పాలన, అంతర్యుద్ధాలతో కొట్టుమిట్టాడుతున్న మయన్మార్‌లో గత వారం శుక్రవారం సంభవించిన భూకంపం తీవ్ర ప్రభావం చూపించింది. 

Also Read: భర్తముందే భార్యపై గ్యాంగ్ రేప్.. ఊరికి వెళ్లి వస్తుండగా నడిరోడ్డుపై ఆపి!

మయన్మార్‌, థాయ్‌లాండ్‌ అనేక బిల్డింగ్‌లు ఊగిపోయాయి. మరికొన్ని ధ్వంసమయ్యాయి. దీంతో భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. ఇప్పటికీ రెస్క్యూ బృందాలు చేరుకోలేని ప్రభావిత ప్రాంతాలు ఉండటం కలకలం రేపుతోంది. దీనివల్ల శిథిలాల కింద చిక్కుకున్నవాళ్లని కాపాడే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటికే వివిధ దేశాలు భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయక బృందాలను పంపిస్తున్నాయి. అయితే వీళ్లు అక్కడికి వెళ్లేందుకు ఆయా చోట్ల ప్రభుత్వ, తిరుగుబాటుదారుల మధ్య జరుగుతున్న ఘర్షణలు ఆటంకం కలిగిస్తున్నాయి.

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

దీనివల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు నెలకొన్నాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, నీరు, షెల్టర్  అందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలాఉండగా ఇప్పటికే భారత్‌..ఆపరేషన్‌ బ్రహ్మ కింద మయన్మార్‌కు 15 టన్నుల సహాయక సామగ్రిని పంపించింది. టెంట్లు,దుప్పట్లు,స్లీపింగ్ బ్యాగులు జనరేటర్లు ఆహార ప్యాకెట్లను అందించింది. అటు అమెరికా,ఇండోనేషియా,చైనా కూడా అవసరమైన సాయం అందించేందుకు ముందుకొచ్చాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామగ్రిని పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్‌ సెక్రటరీ ఆంటోనియా -గుటెరస్‌ వెల్లడించారు.

Also Read: బంగ్లాలో పడిపోతున్న వస్త్ర పరిశ్రమ..200లకు పైగా ఫ్యాక్టరీలు క్లోజ్

rtv-news | earthquake | myanmar earthquake

Advertisment
తాజా కథనాలు