International Space Station : అక్కడ 24గంటల్లో 16 సార్లు సూర్యోదయం, 16 సార్లు సూర్యాస్తమయం

ఇంటర్‌నేషనల్ స్పేస్ సెంటర్ 2011లో ప్రారంభమైంది. దీన్ని కోసం 15 దేశాల 5 అంతరిక్ష సంస్థలు పని చేస్తున్నాయి. భూమికి 403 కిలోమీటర్ల ఎత్తులో 2 బోయింగ్ 747 జెట్‌లైనర్ల సైజ్‌లో ఉంది. ISS 24గంటల్లో 16 సార్లు సూర్యోదయం, 16 సార్లు సూర్యాస్తమయం అవుతుంది.

New Update
International Space Station

International Space Station Photograph: (International Space Station)

గాల్లో మేడలు, వంతెలు కట్టే రోజులు మన టెక్నాలజీ ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడంతా విశ్వంలో ప్రయోగాల మీద పనిలో పడ్డారు. గ్రహాల పుట్టుక, భూమిపై అద్యాయనం చేయడానికి, విశ్వంలో అంతుచిక్కని రహస్యాలు తెలుసుకోడానికి ఖగోళ శాస్త్రేత్తలు అక్కడే మకాం వేశారు. ఐదు బెడ్‌రూమ్ లేదా రెండు బోయింగ్ 747 జెట్‌లైనర్ల పరిమాణంలో ఓ స్పేస్ స్టేషన్ నిర్మించారు. దానిపేరే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. అమెరికాలోని సానా, రష్యా, జపాన్, కెనడా, లాంటి 15 యూరప్ దేశాలు, అందులోని 5 అంతరిక్ష సంస్థలు కలిసి దీన్ని 2000 సంవత్సరంలో ఏర్పాటు పనులు ప్రారంభించారు.

Also Read: పాకిస్థాన్‌లో ఎయిర్‌పోర్టులో దాడులు.. మరో ఉగ్రవాది హతం !

2011 లో అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని పూర్తి చేశారు.  అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి చుట్టూ గంటకు దాదాపు 28 వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. అది తనచుట్టూ తాను తిరగడానికి 90 నిమిషాల టైం పడుతుంది. భూమి కంటే అక్కడ వాతావరణం భిన్నంగా ఉంటుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి నుండి 403 కిలోమీటర్ల దూరంలో ఉంది. స్పేస్ స్టేషన్‌లో 24 గంటల్లో 16 సార్లు సూర్యోదయం, 16 సార్లు సూర్యాస్తమయం జరుగుతుంది. స్పేస్ స్టేషన్ గంటకు 28163 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతుంది. 

Also Read: మాజీ అనొద్దు ఫ్లీజ్‌..మేమింకా విడిపోలేదు....సైరాభాను ఆసక్తికర వ్యాఖ్యలు

భూమిపై ఉన్న అంతరిక్ష కేంద్రం బరువు దాదాపు ఒక మిలియన్ పౌండ్లు అంటే 4లక్షల 53వేల 592.37 కేజీలు. స్పేస్ స్టేషన్ మొత్తం వైశాల్యం ఫుట్‌బాల్ కోర్ట్ అంత ఉంటుంది. ఈ అంతరిక్ష కేంద్రంలో యునైటెడ్ స్టేట్స్, రష్యా, జపాన్ మరియు యూరప్ దేశాల ల్యాబ్స్ నుంచి మాడ్యూల్స్ జరుగుతన్నాయి. భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ 9 నెలలుగా ఇంటర్‌నేషనల్ స్పేస్ స్టేషన్‌లోనే చిక్కుకుపోయారు. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో 8 మంది ఉన్నారు. ఇంటర్‌నేషనల్ స్పేస్ స్టేషన్‌లో  ఏవైనా ప్రయోగాలు చేయడానికి అప్పుడప్పుడు వెళ్లే టెక్నికల్ సైంటిస్టుల కోసం అదనంగా ఏర్పాట్లు ఉంటాయి. నెలలు, సంవత్సరాల కొద్దీ వారు అక్కడ ఉండాల్సి వస్తోంది కాబట్టి.. ఆహారం, నీరు లాంటి పదార్థాలకు బదులుగా శాస్త్రవేత్తలు ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. 2024 జూన్‌లో వెళ్లిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మర్స్ ఇద్దరూ మంగళవారం భూమి మీదకు చేరుకోనున్నారు. వారు అక్కడికి వెళ్ళిన బోయింగ్ స్టార్‌లైనర్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో గత 9 రోజులుగా అక్కడే ఉండిపోయారు.

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు