USA: అమెరికాలో తుఫాన్ విధ్వంసం..34 మంది మృతి

అమెరికాలో చాలా రాష్ట్రాల్లో భారీ తుఫాన్ విధ్వంసం సృష్టించింది. దీని కారణంగా 34 మంది చనిపోయారు. మిసిసిపి, ఆర్కన్సా రాష్ట్రాల్లో ఆరుగురు మరణించగా...దాదాపు 50మంది తీవ్రంగా గాయపడ్డారు. చాలా చోట్ల ఇళ్ళు కూలిపోయాయి. గాలులకు చాలా యాక్సిడెంట్లు అయ్యాయి.  

New Update
us

Storm and Tornados In USA

మంచు తుఫాన్లు అయిపోయాయి...ఇప్పుడు అమెరికాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. టోర్నడోలు విరుచుకుపడుతున్నాయి. దుమ్ముధూళితో కూడిన బలమైన గాలులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో 100కుపైగా కార్చిచ్చులు చెలరేగాయి. దీనివలన 34 మందికి పైగా మృతి చెందారు. మిసోరీలోని బేకర్స్ ఫీల్డ్ ప్రాంతంలో టోర్నడో ప్రభావానికి ఇద్దరు చనిపోయారు. టెక్సాస్ పాన్ హ్యాండిల్ లోని మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మిసిసిపి, ఆర్కన్సా రాష్ట్రాల్లో తుఫాను అత్యధికంగా ప్రబావం చూపించింది. ఇక్కడ దాదాపు పది మంది చనిపోగా...50 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. దాంతో చాలా బిల్డింగులు కూలిపోయాయి. పాఠశాలలు దెబ్బతిన్నాయి అని తెలుస్తోంది. బలంగా వీస్తున్న గాలులకు చెట్లు పడిపోయాయి. రోడ్ల మీద వెళుతున్న ట్రక్కులు సైతం తలకిందులు అయిపోయాయి. అలబామా, కెంటకీ, మిసిసిపీ, టెనసీ, ఇల్లినోయీ, ఇండియానా, టెక్సాస్‌, టెన్నెసీ రాష్ట్రాలకూ ఇంకా టోర్నడోల ముప్పు పొంచి ఉందని జాతీయ వాతావరణ సేవల విభాగం హెచ్చరికలు జారీ చేసింది. 

టోర్నడోల బీభత్సం..

కెనడా సరిహద్దు నుంచి టెక్సాస్ వరకు తుఫాన్లు, టోర్నడోలు భయపెడుతున్నాయి. 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఓక్లహోమా, మిస్సోరీ, న్యూ మెక్సికో, టెక్సాక్, కాన్సన్ లలో గాలుల వల్ల కారిచిచ్చులు చెలరేగుతున్నాయి. దీంతో ప్రజలను కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు.. మిన్నెసొటా, సౌత్‌ డకోటాలోని కొన్ని ప్రాంతాలకు మంచు తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. ఈ తుఫాను కారణంగా షెర్మాన్ కౌంటీలో రోడ్డు మీద వెళుతున్న కార్లు ఢీకున్నాయి. దీని కారణంగా ఎనిమిది మంది చనిపోయారు. మిస్సోరీలో అత్యధిక మరణాలు నమోదయ్యాయని, గత రాత్రి తుఫానులో కనీసం 12 మంది మరణించారని అధికారులు తెలిపారు. బట్లర్ కౌంటీలో ఒకరి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. దాని ఓనర్  మరణించాడు కూడా. డకోటాలో కూడా చాలా ఇళ్ళు కూలిపోయాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారు. తుఫాను కారణంగా జార్జియా రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని విధించారు. గవర్నర్ బ్రియాన్ కెంప్..ప్రజలను అప్రమత్తం చేశారు. ఇళ్ళల్లో నుంచి బయటకు రావొద్దని..జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు