BIG BREAKING: ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. స్పాట్‌లోనే 15 మంది మృతి!

శ్రీలంకలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎల్లా-వెల్లవాయ ప్రధాన రహదారిపై ఓ బస్సు లోయలో పడిపోవడంతో 15 మంది స్పాట్‌లోనే మృతి చెందారు. వీరిలో తొమ్మిది మంది మహిళలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. విహారయాత్రకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

New Update
Srilanka

Srilanka

శ్రీలంకలో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎల్లా-వెల్లవాయ ప్రధాన రహదారిపై ఓ బస్సు లోయలో పడిపోవడంతో 15 మంది స్పాట్‌లోనే మృతి చెందారు. వీరిలో తొమ్మిది మంది మహిళలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. అయితే టాంగల్లె నుండి దాదాపు 30 మంది మున్సిపల్ ఉద్యోగులు ఎల్లాలో విహారయాత్రకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా బస్సు ఓ జీపును ఢీకొట్టింది. దీంతో 1,000 అడుగుల లోతున ఉన్న లోయలో పడిపోయింది. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: ఆఫ్గానిస్తాన్‌లో మరో భారీ భూకంపం.. 2 వేల మందికి పైగా మృతి?

30 మంది ప్రయాణికులతో వెళ్తున్నా వాహనం..

ప్రమాదం జరిగినప్పుడు ఈ బస్సులో దాదాపుగా 30 మంది ప్రయాణికులు ఉన్నారు. 15 మంది మృతి చెందగా మిగతా కొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘోర ప్రమాదంలో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. జీపును ఢీకొట్టి లేదా ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్టున్నారు. అయితే ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Armani: ఫ్యాష్ ఐకాన్ అర్మానీ సృష్టికర్త జార్జియో అర్మానీ కన్నుమూత

Advertisment
తాజా కథనాలు