Armani: ఫ్యాష్ ఐకాన్ అర్మానీ సృష్టికర్త జార్జియో అర్మానీ కన్నుమూత

లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అర్మానీ వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ కన్నుమూశారు. 91 ఏళ్ళ వయసులో ఆయన ఇటలీలో మిలన్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 

New Update
armani

Giorgio Armani

ప్రముఖ ఇటలీ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 91 ఏళ్ళు. వృద్ధాప్యం కారణంగానే అర్మానీ చనిపోయారని గ్రూప్ తెలిపింది. ఈయన రీ జార్జియోగా, కింగ్జారియోగా కూడా గుర్తింపు పొందారు. ఈయన సృష్టించిన కంపెనీ ఏడాదికి 2.3 బిలియన్ యూరోలను టర్నోవర్ చేస్తుంది. మోడరన్ ఇటాలియన్ స్టైల్ కు అర్మానీ పెట్టింది పేరు. అర్మానీ బ్రాండ్ వస్త్ర ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందింది. ఫ్యాషన్ ప్రపంచంలో ఇది ఒక ఐకాన్.

హాలీవుడ్ లో రెడ్ కార్పెట్ పై..

జార్జియో అర్మానీ ఇటలీలో మిలాన్ లోని తన నివాసంలో తన కుటుంబ సభ్యుల మధ్యలో కన్నూమూశారు. అర్మానీ కి కంపెనీలో కూడా మంచి పేరు ఉంది. ఆయన ఉద్యోగులతో , సిబ్బందితో ఎప్పుడూ గౌరవంగా మెలిగే వారని చెబుతారు. చాలాసార్లు అర్మానీ బెస్ట్ డిజైనర్ గా గుర్తింపు పొందారు. ఆయన డిజైన్ చేసిన బట్టల్లో ఇటలీ అందాలు ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకునేవారు. హాలీవుడ్ రెడ్ కార్పెట్ల మీద అర్మానీ డిజైన్ చేసిన  దుస్తులు ఎన్నో సార్లు మెరిశాయి. 

1934లో ఉత్తర ఇటలీలోని పియాసెంజాలో జార్జియో అర్మానీ జన్మించారు. 1957 వరకు ఫ్యాషన్‌ అంటేనే ఆయనకు తెలియదు. జార్జియో మెడిసిన్ చదివారు. ఆ తర్వాత సైన్యంలో చేరారు. అనంతరం మిలాన్‌లోని చరిత్రాత్మక లా రినాస్సెంట్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో విండో డ్రస్సర్‌గా ఉద్యోగం పొందారు. అక్కడ ఆయనకు ఇటలీ ఫ్యాషన్ రాజధానితో  అనుబంధం ప్రారంభమైంది. 1964లో డిజైనర్ నినో సెరుటి అప్పటికి లా రినాస్సెంట్‌లో కొనుగోలుదారుగా ఉన్న అర్మానీకి పురుషుల దుస్తులను డిజైన్ చేసే ఉద్యోగం ఇవ్వడం ద్వారా అవకాశం పొందారు. ఇక్కడే మొదట అన్‌స్ట్రక్చర్డ్ జాకెట్ల గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత సూట్ జాకెట్ల ద్వారా ప్రసిద్ధి పొందారు. 1975లో తన భార్య ఆర్కిటెక్ట్ సెర్గియో గలియోట్టితో కలిసి అర్మానీ బ్రాండ్ ను స్థాపించారు. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూసింది లేదు. 

Also Read: USA: రష్యా, చైనాలకు భయపడుతున్న ట్రంప్..సిద్ధంగా ఉండాలని రక్షణశాఖకు ఆదేశాలు

Advertisment
తాజా కథనాలు