/rtv/media/media_files/2025/07/05/spanish-airport-ryanair-plane-18-injured-after-fire-breaks-out-2025-07-05-18-26-51.jpg)
Spanish airport Ryanair plane 18 injured after fire breaks out
స్పెయిన్‌లోని పాల్మా డి మల్లోర్కా విమానాశ్రయం దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది. రైయాన్ ఎయిర్ విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 18 మంది ప్రయాణికులు గాయపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. మజోర్కాలోని పాల్మా డి మల్లోర్కా విమానాశ్రయంలో.. రైయాన్ RK3445 ఎయిర్ విమానం మాంచెస్టర్ నుండి ల్యాండ్ అయి తిరుగు ప్రయాణానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో క్యాబిన్‌లో ఒక్కసారిగా పొగలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయంతో గజగజ వణికిపోయారు.
Also Read : పెళ్లికాకుండా తల్లికాబోతున్న నటి.. 40 ఏళ్లలో IVF ద్వారా!
Also Read : బీచ్ లో చెమటలు పట్టిస్తున్న ఆశు.. ఫొటోలు చూస్తే అంతే!
Ryanair plane
చిన్న చిన్న మంటలు చెలరేగే సమయంలో అంతా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. దీంతో ప్రయాణీకులు భయంతో విమానం లోపల నుంచి బయట రెక్కలపైకి ఎక్కి అక్కడ నుంచి కిందికి దూకారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Passengers leap on WING to flee low-cost plane FIREBALL pic.twitter.com/oI1Dp7nnvG
— RT (@RT_com) July 5, 2025
Also Read : వంట చేసేటప్పుడు చేసే ఈ పొరపాటు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి తెలుసా!?
ఇక సమాచారం అందుకున్న అత్యవసర సేవలు వెంటనే స్పందించి.. సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. విమానాశ్రయంలోని అగ్నిమాపక సిబ్బంది, సివిల్ గార్డ్ సభ్యులతో పాటు నాలుగు అంబులెన్స్‌లు, రెండు ప్రాథమిక లైఫ్ సపోర్ట్ యూనిట్లు, రెండు అధునాతన యూనిట్లు - సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఇందులో పద్దెనిమిది మంది గాయపడగా.. వారికి ట్రీట్మెంట్ అందించారు. వారిలో ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు.
వైరల్ అయిన వీడియో ప్రకారం.. ప్రయాణీకులు భయంతో విమానం నుండి తప్పించుకుంటున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. వారు ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసి రెక్కల పైనుంచి నేలపైకి దూకినట్లు ఉంది.
Also Read : ఇట్స్ అఫీషియల్.. అనుష్క ఘాటీ మళ్ళీ వాయిదా!
Spanish airport