Spain Floods:
తూర్పు స్పెయిన్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల కారణంగా దాదాపుగా 205 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఈ వరదల్లో చాలా మంది గల్లంతయ్యారు. వరద ప్రవాహంలో వందలాది కార్లు కొట్టుకుపోయాయి. భవనాలు, శిథిలాలు, కార్లపై కొందరు తలదాచుకున్నారు.
ఇది కూడా చదవండి: పొంగులేటికి షాక్ ఇచ్చిన సీనియర్లు.. ఆ అంశాలపై హైకమాండ్ కు ఫిర్యాదు!
వరదలకు కొట్టుకుపోవడంతో..
మూడు రోజులు ఈ వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ వృక్షాలు, విద్యుత్ లైన్లు, ఇళ్లలోని సామాగ్రి అన్ని వరదలకు కొట్టుకుపోయాయి. ఇక దక్షిణ స్పెయిన్‌లో కూడా భారీ వర్షాలు కురిశాయి. దీంతో అక్కడి వీధులన్నీ బురద నీటితో నిండిపోయాయి. వరదల వల్ల తప్పిపోయిన వారి ఆచూకీ కోసం డ్రోన్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు చెప్పారు.
ఇది కూడా చదవండి: సమీపిస్తున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఎంతమంది బరిలో ఉన్నారంటే
అధికారుల సలహాలను కూడా పాటించాలని ప్రజలను అధికారులు కోరారు. వరదల్లో చిక్కుకున్న వాళ్లని హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. ఈ ఆకస్మిక వరదల వల్ల తీవ్రంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎంత జరిగిందని వెల్లడించలేదు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: మేమంతా ఒకే పిడికిలి.. రిటెన్షన్ పై హార్దిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇదిలాఉండగా ఈ మధ్యకాలంలో అనేక దేశాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారత్, చైనా, అమెరికా, జపాన్ దేశాల్లో వరదలు తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్పెయిన్‌లో కూడా వరదలు అక్కడి ప్రజల జీవన విధానాన్ని అతలాకుతలం చేసింది. మరోవైపు ప్రపంచంలో జరుగుతున్న వాతావరణ మార్పుల వల్లే భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: త్వరలోనే పాదయాత్ర.. కేటీఆర్ సంచలన ప్రకటన!