Moranchapalli: మోరంచపల్లిలో బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే గండ్ర
శుక్రవారం మోరంచపల్లిలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి (MLA Gandra Venkata Ramana reddy), జిల్లా పరిషత్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి (Gandra Jyothi) పర్యటించారు. ఇంటింటికి తిరిగి బాధితులను పరామర్శించారు. బాధితుల క్షేమసమాచారాలు అడిగితెలుసుకున్నారు. పలువురు వరద ఉధృతిని గురించి గండ్ర దంపతులకు వివరించారు. బాధితులకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముంపు ప్రాంతం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతానికి బోట్ల ద్వారా తరలించారు...