/rtv/media/media_files/l9cWXIvD0woloanzI6bX.jpg)
గత వారం బీరూట్ లో జరిగిన దాడుల్లో హెజ్‌బొల్లా అధిపతి హసన్ నస్రల్లా, అతని కుమార్తె మరణించిన విషయం తెలిసిందే. తాజాగా నస్రల్లా అల్లుడు మృతి చెందినట్లు సమాచారం. సిరియాలోని డమాస్కస్ లోని మజ్జే జిల్లాలో నివాస భవనాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇద్దరు లెబనాన్ లు మృతి చెందారు.
Also Read: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వానలు!
వారితో పాటు హసన్ నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్ - ఖాసిర్ సైతం మరణించినట్లు సిరియాన్ మానవ హక్కువ అబ్జర్వేటరీ తెలిపింది. ఇక హెజ్‌బొల్లాకు చెందిన ఓ మీడియా సైతం ఖాసిర్ మరణాన్ని ధ్రువీకరించింది.
Also Read: దిగొచ్చిన కొండా సురేఖ...సామ్ కి క్షమాపణలు!
మరో వైపు ఇరాన్-ఇజ్రాయెల్ ల మధ్య యుద్ధంలో అమెరికాకు చెందిన పౌరుడు సైతం మృతి చెందినట్లు యూఎస్ పేర్కొంది. వాషింగ్టన్-మిచిగాన్ లోని డియర్ బోర్న్‌కు చెందిన కమెల్ అహ్మద్ జావెద్ మృతి చెందినట్లు అమెరికా ప్రకటించింది.
Also Read:స్మార్ట్ ఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. రూ. 6000 డిస్కౌంట్ తో Motorola Edge 50 Pro
అహ్మద్ మృతి తమను ఎంతో బాధకు గురిచేసిందని వైట్ హౌస్ పేర్కొంది. బాధితుడి కుటుంబ సభ్యులుకు అండగా ఉంటామని వెల్లడించింది. లెబనాన్ లో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల నుంచి వృద్దులు, దివ్యాంగులకు సాయం చేసేందుకు బయటకు వెళ్లగా..ఆ ప్రాంతంలో జరిగిన క్షిపణి దాడిలో నా తండ్రి మరణించారని జావెద్ కుమార్తె వెల్లడించింది.
Also Read: ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం పై జీ 7 అత్యవసర సమావేశం!