Samantha: దిగొచ్చిన కొండా సురేఖ...సామ్ కి క్షమాపణలు!

సమంతకు మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. తన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని.. అన్యదా భావించవద్దని కోరారు.

New Update

Samantha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర సంచలనం రేపుతున్నాయి. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను(KTR)  విమర్శిస్తూ సినీ పరిశ్రమ నటులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. సమంత(Samantha) , నాగచైతన్య (NagaChaitanya) కేటీఆర్ వల్లే విడాకులు తీసుకున్నారని మీడియాతో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

ఈ మాటలపై అక్కినేని కుటుంబంతో సమంత కూడా మండిపడ్డారు. అలాగే పలువురు సినీ నటీనటులు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. బాధ్యతగల పదవిలో ఉన్నప్పుడు కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి తీసుకురావడం కరెక్ట్ కాదని సినీ ప్రముఖులు చాలా మంది మండిపడుతున్నారు.

ఈ క్రమంలో కొండా సురేఖ వివాదాస్పదం కావడంతో  ...మంత్రి తాజాగా స్పందించారు. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ   @Samanthaprabhu2 మనోభావాలను దెబ్బతీయడం కాదు అంటూ ట్వీటర్లో రాసుకొచ్చారు.

స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం  అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా..నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ  మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యద భావించవద్దు అంటూ  కొండా సురేఖ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

Also Read: రైతులకు కేంద్రం 'దసరా' కానుక - 'పీఎం కిసాన్‌ నిధులు' విడుదల ఎప్పుడంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు