Israel Hamas War: గాజాతో యుద్ధంలో ఇజ్రాయెల్ అతిపెద్ద విజయం అందుకుంది. అక్టోబరు 7 దాడుల సూత్రధారి హమాస్ మిలిటెంట్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్‌ను (Yahya Sinwar) తుదముట్టించింది. ఈ విషయాన్ని గురువారం ఇజ్రాయెల్ విదేశాంగమంత్రి కాంట్జ్ నిర్థారించారు. ఇది ఇజ్రాయెల్‌కు సైనికంగా, నైతికంగా ఘనవిజయమని చెప్పారు. ఇరాన్ నేతృత్వంలో రాడికల్ ఇస్లాం దుష్టశక్తులకు వ్యతిరేకంగా స్వేచ్ఛా ప్రపంచం సాధించిన విజయమిది అని అన్నారు.
Also Read: జనవరి నుంచి కొత్త పింఛన్లు..నవంబర్‌లో దరఖాస్తుల స్వీకరణ
సిన్వర్ మృతితో తక్షణ కాల్పుల విరమణకు, బందీల విడుదలకు మార్గం సుగమం కానుందిని చెప్పారు. సిన్వర్‌ను హతమార్చి, లెక్కను సరిచేశామని అయితే యుద్ధం మాత్రం ఆగదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. బందీలను సురక్షితంగా తీసుకురావడమే తమ ధ్యేయమని అన్నారు. ఇక ఎంత మాత్రం గాజాను హమాస్ నియంత్రించలేదని అన్నారు.
Also Read: హనుమంతుడి గుడి కూల్చివేతలో ట్విస్ట్...ఎవరు చేశారో తెలుసా!
తమ నాయకుడి మరణంపై హమాస్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే కీలక నేతలంతా హతమైన వేళ సిన్వర్ మృతి హమాస్‌కు భారీ దెబ్బ అని చెబుతున్నారు. దక్షిణ గాజాలో బుధవారం ముగ్గురు హమాస్ మిలిటెంట్లను ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) హతమార్చింది. ఇందులో ఓ వ్యక్తికి సిన్వర్ పోలికలు ఉన్నట్లు గుర్తించిన ఐడీఎఫ్, డీఎన్‌ఏ, దంత నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి హమాస్ నేత అని నిర్థారించుకుంది.
గాజా యుద్ధానికి కారణమైన అక్టోబరు 7 మారణహోమానికి సూత్రధారి సిన్వరేనని తొలి నుంచి ఇజ్రాయెల్ బలంగా నమ్ముతుంది. గతేడాది ఇజ్రాయెల్ సరిహద్దులపై హమాస్ జరిపిన దాడిలో 1200 మంది మృతి చెందారు. 250 మందిని బందీలుగా గాజాకు తీసుకువెళ్లింది. ఇంకా హమాస్ దగ్గర 100 మంది బందీలుగా ఉన్నారు.
Also Read: దగ్గరవుతున్న వైసీపీ, కాంగ్రెస్...షర్మిల, జగన్ ఒకటే మాట
ఈ నేపథ్యంలోనే ఏడాదిగా సిన్వర్ కోసం గాజా సొరంగాల్లో ఐడీఎఫ్ వేట కొనసాగిస్తోంది. కొన్ని సార్లు దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడని పలుమార్లు పేర్కొంది. తనను ఇజ్రాయెల్ హతమార్చకుండా బందీల మధ్య సిన్వర్ తల దాచుకుంటున్నట్లు అమెరికా నిఘా వర్గాలు కూడా ఇటీవల పేర్కొన్నాయి. బందీలకు ఎలాంటి హాని జరగలేదని పేర్కొంది. హమాస్ అగ్రనేత మృతికి సంబంధించిన సమాచారాన్ని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో ఇజ్రాయెల్ చెప్పింది.
ప్రపంచానికి మంచిరోజు
ఉగ్రసంస్థ హమాస్ అగ్రనేత యహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టడం ఆ దేశం, తమ దేశంతో పాటు యావత్ ప్రపంచానికి శుభదినమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఈ ఘటన హమాస్ చెరలో ఉన్న బందీల విడుదలకు, ఏడాదిగా సాగుతున్న గాజా యుద్ధ పరిసమాప్తికి బాటలు వేసే అవకాశం ఉందని ఆయన భిప్రాయపడ్డారు.
అల్‌ఖైదా అధినేత, సెప్టెంబరు 11, 2001 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్‌ను చంపేసిన ఘటనతో ఈ ఘటనను సరిపోల్చారు. సిన్వర్ అంతంతో గాజా యుద్ధం ముగింపునకు మార్గం సుగమం అయిందని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు.
Also Read: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. మద్యం ధరలు భారీగా పెంపు..?