Ycp-Congress: దగ్గరవుతున్న వైసీపీ, కాంగ్రెస్‌...షర్మిల, జగన్‌ ఒకటే మాట

కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఒకే రోజు కూటమి సర్కారును టార్గెట్‌ చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని.. సూపర్‌ 6 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయడం లేదంటూ విరుచుకుపడుతున్నారు.

New Update
sharmila

Ycp-Congress: గత కొంతకాలంగా ఉప్పు నిప్పులా ఉన్న వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్య స్నేహభావం ఏర్పడుతోందా..? ఎన్నికలకు ముందు ఆ తర్వాత జగన్‌పై ఘాటు విమర్శలు చేసిన ఏపీసీసీ చీఫ్‌ షర్మిల.. ఇటీవల కాలంలో కూటమి సర్కారుపై దాడికి దిగుతున్నారా..? ఇటీవల ఎన్నికల ఫలితాలపై స్పందించిన మాజీ సీఎం జగన్‌.. కాంగ్రెస్‌ అనుకూలంగా ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేసి ఆ పార్టీకి దగ్గరవ్వాలని చూస్తున్నారా..? త్వరలో రెండు పార్టీలు ఒకేతాటి మీదకు రానున్నాయా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 

Also Read: తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయానన్న సజ్జల

ప్రస్తుతం కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల, వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ఒకే రోజు కూటమి సర్కారును టార్గెట్‌ చేసి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నాడని.. సూపర్‌ 6 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయడం లేదంటూ విరుచుకుపడుతున్నారు. అలాగే రాష్ట్రంలో మద్యం మాఫియాను ప్రోత్సహిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మాటలు తప్ప చేతల్లో ఏమీ కనబడటం లేదని రెచ్చిపోతున్నారు. ఇన్నాళ్లు వైసీపీ నాయకులు షర్మిలను, కాంగ్రెస్‌ నాయకులు జగన్‌ను ఏకిపడేశారు. ఇటీవల మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరూ కూటమి సర్కారును టార్గెట్‌ చేస్తున్నారు.

సూపర్‌ 6 ఎక్కడ?: షర్మిల


గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఏపీసీసీ చీఫ్‌ షర్మిల కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు గాలికి కొట్టుకుపోయాయని మండిపడ్డారు. వాటి స్థానంలో కొత్తగా సిక్స్ పాలసీలు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో సూపర్ సిక్స్‌లో ఒక్క సిక్స్ అయినా అమలు చేస్తారని అనుకున్నామని చెప్పారు. మహిళలకు శుభవార్త చెబుతారనుకుంటే.. మెుండి చేయి చూపారని ఫైరయ్యారు. అలాగే భారీ పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారని.. ఆ చిత్తశుద్ధి బాబుకు ఉందా అని ప్రశ్నించారు. 

Also Read:  చేత‌కాని ద‌ద్ద‌మ్మ అంటూ రేవంత్‌పై కేటీఆర్ ఫైర్!

2014లో పెద్ద పెద్ద పథకాలు అన్నారని.. అమరావతిని సింగపూర్ చేస్తానని 3D గ్రాఫిక్స్ చూపించారని.. అప్పుడు చెప్పిన వాటికి.. ఇప్పుడు చెప్పిన వాటికి తేడా లేదన్నారు. పాత సినిమాకి కొత్త టైటిల్ పెట్టాడని.. బాబు చెప్తుంటే ఈ కథ ఎక్కడో విన్నట్లు అనిపించిందని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల పరిధిలో దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేస్తారో శ్వేత పత్రం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లోకేష్ మోడీకి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారట... 21 మంది ఎంపీలు ఇస్తామని చెప్పి ఇచ్చారట. 

Also Read:  విషాదం.. భర్తతో కలిపే దహనం చేయమని..

మీరు ఇచ్చిన మాట సరే.. మోదీ ఇచ్చిన మాటేంటి..? ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో మోదీ చెప్పాడు కదా... ఇచ్చిన మాట ఎక్కడ పోయిందని ప్రశ్నించారు. సూపర్ సిక్స్ పాలసీలు సరే.. సూపర్ సిక్స్ పథకాలు ఎక్కడ పోయాయి. తల్లికి వందనం నిధుల కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారు. ఉచిత సిలిండర్లకు దసరా అన్నారు.. దీపావళి అన్నారు.. రేపు సంక్రాంతి అంటారేమో..! ఏడాదికి 2 వేల నుంచి 4 వేల కోట్లకు ఖర్చు అయ్యే పథకానికి నిధులు లేవా? ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏమయ్యింది? లిక్కర్ విషయంలో తెలుగు తమ్ముళ్లు మాఫియాగా తయారయ్యారని ఫైరయ్యారు.

దారుణమైన సర్కారును ఎన్నడూ చూడలేదు: జగన్‌


గురువారం నాడు పార్టీ నాయకులతో జగన్‌ వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలో ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. నాలుగు నెలల్లోనే ఈ ప్రభుత్వం వద్దు అని ప్రజలే అంటున్నారని.. ఇసుక టెండర్లకు రెండు రోజులే గడువు. కనీసం టెండర్లు పిలుస్తున్నారన్న విషయం ఎవ్వరికీ తెలియదన్నారు. టెండర్లు వేయడానికి ఎవ్వరూ కూడా పోని పరిస్థితి. ఇసుక రేటు వైసీపీ ప్రభుత్వంలోకంటే డబుల్‌ రేటు, ట్రిపుల్‌ రేటు పలుకుతుంది. 

Also Read:  హరీష్ రావు బంధువులపై కేసు నమోదు!

ఇసుక సొమ్మును దోచుకోవడానికి పాలసీని మార్చారు. స్టాక్‌ యార్డులు, రీచ్‌లు అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే ఖాళీ చేసేశారు. లిక్కర్‌ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ.. కూటమి ప్రభుత్వంపై జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ నేతలకు, వారి అనుచరులకు ప్రతినియోజకవర్గంలో 10 పేకాట క్లబ్ లు నడుస్తున్నాయి. ఎవరు ఏం చేయాలన్నా ఎమ్మెల్యేలకు కప్పం కట్టాల్సిందే. డబ్బు ఇవ్వకపోతే వ్యాపారమే లేదు. పోలీసుల సహాయంతో బెదిరిస్తున్నారని కూటమి పార్టీల నేతలపై జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆరోగ్య శ్రీ పూర్తిగా నీరుగారిపోయింది, ఆరోగ్య ఆసరా లేదు.. ఆస్పత్రులు నిర్వీర్యం అయిపోయాయి.. మూడు త్రైమాసికాలు వచ్చినా.. విద్యాదీవెన, వసతి దీవెన లేదు.. ఇంగ్లిషు మీడియం లేదు, సీబీఎస్‌ఈ లేదు, టోఫెల్‌ క్లాసులు లేవు.. గోరుముద్ద కూడా పాడైపోయింది.. అన్ని రంగాలూ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. ఉచిత ఇన్సూరెన్స్‌ గాలికి ఎగిరిపోయింది.ఆర్బీకేలుపూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. పంటలకు ఎంఎస్‌పీలు రాని పరిస్థితి. 

ఎక్కడ చూసినా స్కాంలే

ఇంటివద్దకు సేవలు నిలిచిపోయాయి. ఏం కావాలన్నా మళ్లీ జన్మభూమి కమిటీలచుట్టూ తిరగాలి. లక్షన్నర పెన్షన్లు ఇప్పటికే తొలగించారు. లా అండ్‌ ఆర్డర్‌ సిట్యువేషన్‌ ఘోరంగా ఉంది. దిశ యాప్‌ కూడా ఏమయ్యిందో తెలియదు. దారుణంగా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా స్కాంలే కనిపిస్తున్నాయని.. ఈ పరిస్థితుల్లో మనం పోరాడాలని జగన్‌ పిలుపునిచ్చారు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు